IND vs SA 1st టెస్ట్: మైలురాయికి చేరువలో రోహిత్, కోహ్లీ

సెంచూరియన్: దక్షిణాఫ్రికా పర్యటనలో భారత జట్టు కీలక సవాల్‌కు సిద్ధమైంది. ఇప్పటికే టీ20 సిరీస్‌ను సమం చేసి వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుని జోరు మీదున్న టీమ్ ఇండియా.. నేటి నుంచి జరిగే టెస్టు సిరీస్‌లో సత్తా చాటాలని పట్టుదలతో ఉంది. వన్డే సిరీస్ కైవసం చేసుకున్న ఊపులో.. టెస్టు సిరీస్ లోనూ విజయం సాధించి 31 ఏళ్ల నిరీక్షణకు తెరపడాలని భావిస్తోంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో టెస్టు సిరీస్‌లు గెలిచిన టీమిండియా.. దక్షిణాఫ్రికాలో మాత్రం నిరాశనే మిగిల్చింది. దీంతో ఎలాగైనా టెస్టు సిరీస్ గెలిచి ఆ లోటును భర్తీ చేసుకోవాలని టీమ్ ఇండియా భావిస్తోంది. ఈ క్రమంలో సెంచూరియన్ వేదికగా నేటి నుంచి తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు ఎన్నో మైలురాయి రికార్డులను సొంతం చేసుకున్నారు.

96- టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో 96 పరుగులు చేస్తే, అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో దక్షిణాఫ్రికాపై 2000 పరుగులు పూర్తి చేస్తాడు. దక్షిణాఫ్రికాపై రోహిత్ ఇప్పటివరకు 1904 పరుగులు చేశాడు.

66- ఈ తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా సీనియర్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి 66 పరుగులు చేస్తే.. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లో 2000 పరుగులు పూర్తి చేస్తాడు. విరాట్ కోహ్లీ ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో కలిపి 1934 పరుగులు చేశాడు.

11- అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇప్పటివరకు 489 వికెట్లు పడగొట్టాడు. మరో 11 వికెట్లు తీస్తే 500 వికెట్ల క్లబ్‌లో చేరతాడు.

2- టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో ఇప్పటి వరకు 548 వికెట్లు పడగొట్టాడు. మరో 2 వికెట్లు తీస్తే 550 వికెట్లు పూర్తి చేస్తాడు.

51- టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ మరో 51 పరుగులు చేస్తే ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో కలిపి 1000 పరుగులు పూర్తి చేస్తాడు. శ్రేయాస్ ఇప్పటివరకు 949 పరుగులు చేశాడు.

34- టీమిండియా యువ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ మరో 34 పరుగులతో అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *