భారత్‌తో వన్డేలకు విండీస్ జట్టు
న్యూఢిల్లీ: భారత్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌లో పాల్గొనే 15 మంది సభ్యుల వెస్టిండీస్ జట్టును ప్రకటించారు. గురువారం ఈ సిరీస్ ఆరంభం కానుంది. కాగా, రెండేళ్ల తర్వాత వన్డే జట్టులో హెట్‌మయెర్‌కు చోటు కల్పించారు. అతడు 2021, జూలైలో ఆస్ట్రేలియాతో తన చివరి మ్యాచ్ ఆడాడు. ఐపీఎల్‌లో ఆడిన 13 మ్యాచ్‌ల్లో 299 పరుగులు చేయడంతో సెలెక్టర్లు అతడిపై నమ్మకముంచారు. ఇక, పేసర్ ఒషానె థామస్ కూడా జట్టులో చేరనున్నాడు. పూరన్, హోల్డర్‌లను ఈ సిరీ్‌సకు దూరంగా ఉంచారు.
జట్టు:
హోప్ (కెప్టెన్), పోవెల్, అథనజె, యానిక్ కేరియా, కాసీ కార్టీ, డ్రేక్స్, హెట్‌మయెర్, థామస్, జోసెఫ్, కింగ్, మేయర్స్, మోటీ, సీల్స్, షెఫర్డ్, సిన్‌క్లెయిర్.