ABN
, First Publish Date – 2023-07-27T02:52:35+05:30 IST
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ)లో బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ ఆధిపత్యానికి తెరపడినట్టే కనిపిస్తోంది.

ఓటర్ల జాబితానుంచి పేరు తొలగింపు
కొడుకు, అల్లుడు కూడా
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ)లో బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ (Brijbhushan) ఆధిపత్యానికి తెరపడినట్టే కనిపిస్తోంది. ప్రస్తుత డబ్ల్యూఎఫ్‌ఐ కార్యవర్గాన్ని గత ఏప్రిల్‌లో రద్దు చేసేంతవరకు బ్రిజ్‌భూషణ్ అధ్యక్షుడిగా ఉండగా, అతడి కుమారుడు కరణ్ ప్రతాప్ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించాడు. బ్రిజ్‌భూషణ్ ఒక అల్లుడు ఆదిత్య ప్రతాప్ సింగ్ మాజీ సంయుక్త కార్యదర్శి కాగా, మరో అల్లుడు విశాల్ సింగ్ ప్రస్తుతం బిహార్ రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడిగా వ్యహరిస్తున్నాడు. ఇక..సమాఖ్య ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాను ప్రకటించారు. బ్రిజ్‌భూషణ్, కరణ్, ఆదిత్య ప్రతా్‌పలు ఎవరికీ ఈ జాబితాలో చోటు కల్పించలేదు. విశాల్‌కు మాత్రం బిహార్ సంఘం తరపున ఓటు హక్కు లభించింది.
Updated Date – 2023-07-27T02:52:35+05:30 IST