ABN
, First Publish Date – 2023-07-25T02:19:42+05:30 IST
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత అరంగేట్ర పేసర్ ముకేశ్ కుమార్ రెండు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.

పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత అరంగేట్ర పేసర్ ముకేశ్ కుమార్ రెండు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. అయితే తుది జట్టుకు ఎంపికయ్యానని తెలిసిన తర్వాత కొద్దిసేపు షాక్‌లో ఉండిపోయానని చెప్పాడు. ‘మ్యాచ్‌లో వికెట్లు తీయగానే కోహ్లీ, రోహిత్ నన్ను హత్తుకున్నారు. నిజంగా అది మధురానుభూతి. ఎందుకంటే ఇటీవలి వరకు వారి ఆటను నేను టీవీలోనే చూశాను. ఇప్పుడు వారితోనే కలిసి ఆడుతూ, షేక్ హ్యాండ్ ఇవ్వడం ప్రత్యేకంగా అనిపిస్తోంది’ అని అన్నాడు.
Updated Date – 2023-07-25T02:19:42+05:30 IST