రోహిత్ శర్మ: టీ20ల్లో ఎంఎస్ ధోని రికార్డును రోహిత్ శర్మ సమం చేశాడు

రోహిత్ శర్మ: టీ20ల్లో ఎంఎస్ ధోని రికార్డును రోహిత్ శర్మ సమం చేశాడు

ABN
, ప్రచురణ తేదీ – జనవరి 15, 2024 | 03:47 PM

రోహిత్ శర్మ: భారత క్రికెట్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రోహిత్ శర్మ తన పేరిట ఎన్నో రికార్డులను లిఖించుకున్నాడు. బ్యాట్స్‌మెన్‌గా, కెప్టెన్‌గా ఎన్నో విజయాలు సాధించాడు. ఇప్పుడు టీ20ల్లో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని రికార్డును సమం చేశాడు.

రోహిత్ శర్మ: టీ20ల్లో ఎంఎస్ ధోని రికార్డును రోహిత్ శర్మ సమం చేశాడు

భారత క్రికెట్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రోహిత్ శర్మ ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. బ్యాట్స్‌మెన్‌గా, కెప్టెన్‌గా ఎన్నో విజయాలు సాధించాడు. ఇప్పుడు టీ20ల్లో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని రికార్డును సమం చేశాడు. టీ20 ఫార్మాట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా ధోనీ అగ్రస్థానంలో ఉండగా, ఇప్పుడు రోహిత్ శర్మ అతని రికార్డును సమం చేసి అగ్రస్థానాన్ని పంచుకున్నాడు. అయితే.. సక్సెస్ రేషియో విషయంలో మాత్రం రోహిత్ టాప్ లో ఉన్నాడు.

టీ20 ఫార్మాట్‌లో మొత్తం 72 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన ధోనీ.. తన కెప్టెన్సీలో భారత జట్టుకు 41 విజయాలు అందించాడు. కానీ.. రోహిత్ శర్మ కేవలం 53 మ్యాచ్‌ల్లోనే 41 విజయాలు సాధించాడు. ఆదివారం అఫ్గానిస్థాన్‌పై భారత్ విజయం సాధించడంతో.. రోహిత్ ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. విజయాల పరంగా ఇద్దరూ సమానమే అయినా నిష్పత్తిలో మాత్రం ధోనిని రోహిత్ అధిగమించాడు. అంతేకాదు.. పొట్టి ఫార్మాట్‌లో 150 మ్యాచ్‌లు ఆడిన ఏకైక క్రికెటర్‌గా (పురుషుల్లో) చరిత్ర సృష్టించాడు. కాకపోతే.. ఆ మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరగడం భారత క్రీడాభిమానులను నిరాశకు గురి చేసింది.

ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులు చేసి ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ 15.4 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌటైంది. యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్ (68), శివమ్ దూబే (63) ఊచకోత కోయడంతో.. భారత్ కు ఈ గొప్ప విజయం దక్కింది. దీంతో… మూడు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌ను 2-0 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది.

నవీకరించబడిన తేదీ – జనవరి 15, 2024 | 03:47 PM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *