విక్రమ్ సినిమాతో అన్ని ఇండస్ట్రీల దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఈ చిత్రం భారీ విజయం సాధించి కోలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టింది.
విక్రమ్ సినిమాతో అన్ని ఇండస్ట్రీల దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఈ చిత్రం భారీ విజయం సాధించి కోలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టింది. లోకేష్ ప్రస్తుతం ఇళయదళపతి విజయ్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ వర్కింగ్ టైటిల్ ‘దళపతి 67’. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ నిర్మించింది. ఈ సినిమా పట్టాలెక్కుతుండగానే లోకేష్ గురించిన ఓ అప్‌డేట్ కోలీవుడ్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్‌తో లోకేష్ కనకరాజ్ ఓ సినిమా చేయబోతున్నాడని కోలీవుడ్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. ‘దళపతి 67’, ‘ఖైదీ 2’ సినిమాల షూటింగ్ పూర్తయిన తర్వాత అల్లు అర్జున్ ప్రాజెక్ట్ పూర్తి కానుందని సమాచారం. ఈ రెండు ప్రాజెక్టులను లోకేష్ పూర్తి చేసేలోపే అల్లు అర్జున్ ‘పుష్ప 2’ని పూర్తి చేస్తాడని తెలుస్తోంది. లోకేష్ కనకరాజ్ ప్రస్తుతం విజయ్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత కార్తీతో ‘ఖైదీ 2’ సినిమా తీయనున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత అల్లు అర్జున్ స్క్రిప్ట్ పై పూర్తి దృష్టి పెట్టనున్నాడు. లోకేష్ గతంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మరియు జయం రవిలతో కలిసి పని చేస్తారని పుకార్లు వ్యాపించాయి. కానీ, ఈ హీరోల డేట్లు ఖాళీగా లేవు. కాబట్టి ఇప్పటి వరకు ఎలాంటి సినిమాలను ప్రకటించలేదు. కొద్ది రోజుల క్రితం లోకేష్ కనకరాజ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. పదేళ్లుగా బిజీ షెడ్యూల్ నడుస్తోందన్నారు. ఆ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్‌తో సినిమా గురించి ప్రస్తావించలేదు. ఈ తరుణంలో బన్నీతో సినిమా చేయడం లోకేష్ కి కాస్త కష్టమే.
నవీకరించబడిన తేదీ – 2023-01-07T17:31:44+05:30 IST