డిసెంబరు 21న ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేస్తామని చెప్పిన సీఎం జగన్.. బైజస్ ట్యాబ్‌లలో కంటెంట్‌ను అప్‌లోడ్ చేస్తున్నట్లు చెప్పారు. 50 శాతం పాఠశాలల్లో 30, 230 తరగతి గదులను డిజిటలైజేషన్ చేస్తున్నారు. విద్యార్థుల ఆంగ్ల నైపుణ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో TOEFL పరీక్షల కోసం
డిసెంబర్ 21న విద్యార్థులకు పంపిణీ: సీఎం
అమరావతి, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): డిసెంబరు 21న ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేస్తామని చెప్పిన సీఎం జగన్.. బైజస్ ట్యాబ్‌లలో కంటెంట్‌ను అప్‌లోడ్ చేస్తున్నట్లు చెప్పారు. 50 శాతం పాఠశాలల్లో 30, 230 తరగతి గదులను డిజిటలైజేషన్ చేస్తున్నారు. శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో విద్యార్థులకు ఇంగ్లీషులో నైపుణ్యం పెంపొందించే ఉద్దేశంతో టోఫెల్ పరీక్షలకు సంబంధించి ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీసెస్ (ఈటీఎస్) సంస్థతో పాఠశాల విద్యాశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో పాఠశాల స్థాయిలో టోఫెల్ పరీక్షలను ప్రవేశపెడుతున్నామన్నారు. దీంతో రాష్ట్ర విద్యారంగం స్వరూపమే మారిపోతుందన్నారు. ఈటీఎస్ తరపున లెజో సామ్ ఊమెన్, పాఠశాల విద్యాశాఖకు చెందిన సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు ఒప్పందంపై సంతకాలు చేశారు.
అవన్నీ క్రమబద్ధీకరించలేవు!: సజ్జల
కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న లెక్చరర్లందరినీ రెగ్యులరైజ్ చేయాలని కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లు ఆందోళన చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,600 మంది జూనియర్ లెక్చరర్లు పనిచేస్తే అందులో 1,400 మంది మాత్రమే రెగ్యులర్ గా ఉన్నారని ఆరోపించారు. శుక్రవారం తాడేపల్లిలోని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జూనియర్ లెక్చరర్లతో సలహాదారు సజ్జల మాట్లాడారు. ఇప్పటికే కటాఫ్ డేట్ ఫిక్స్ చేసినందున మార్చడం కుదరదన్నారు. ఇలాగే రూల్ మార్చితే అన్ని శాఖల్లో చాలా మంది ఉన్నారని, వారిని రెగ్యులరైజ్ చేయలేరని అన్నారు. అయితే చాలా మందికి అన్యాయం జరుగుతుందని జూనియర్ లెక్చరర్లు చెప్పడంతో వారం రోజుల్లో పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఆందోళనలో కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల జేఏసీ చైర్మన్ కుమారకుంట సురేష్, కో చైర్మన్ కల్లూరి శ్రీనివాస్, పద్మారావు, రత్నకుమారి, దీప తదితరులు పాల్గొన్నారు.
నవీకరించబడిన తేదీ – 2023-06-24T12:22:19+05:30 IST