మలయాళ చిత్రం ‘నాయట్టు’ #నాయట్టు ఆధారంగా, నిర్మాత బన్నీవాసు GA2Pictures పై తెలుగు చిత్రం ‘కోటబొమ్మాళి PS’. ఇందులో శ్రీకాంత్ మేక, వరలక్ష్మి శరత్‌కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రలు పోషించారు. మలయాళ చిత్రసీమలో రాజకీయాలకు, పోలీసులకు మధ్య జరిగే సంఘర్షణలా ఈ కథ ఉంటుంది. గతంలో ‘జోహార్’, ‘అర్జున ఫాల్గుణ’ చిత్రాలను రూపొందించిన తేజ మార్ని ఈ కథను తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా తెరకెక్కిస్తున్నాడు.
ఈ చిత్రంలో సీనియర్ నటుడు శ్రీకాంత్ మేక ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ కూడా మరో ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ మరో రెండు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈరోజు సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి “కోట బొమ్మాళి పిఎస్” అనే ఆసక్తిని రేకెత్తిస్తున్న టైటిల్ ను లాక్ చేయగా, శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ పాత్రలను పోస్టర్‌లో రివీల్ చేశారు.
జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మలయాళ చిత్రసీమలో చాలా గొడవలు జరుగుతున్నాయి. మలయాళంలో తమ రాజకీయ ప్రభావం కోసం అవసరమైతే పోలీసులను ఎలా ఉపయోగించుకున్నారో, ఒక చిన్న సంఘటన ఎలాంటి గొడవకు దారితీస్తుందో చక్కగా చూపించారు. అయితే తెలుగులో ఎంత వరకు చూపించగలిగాడు అనేది ఆసక్తికరం.
కోటబొమ్మాళి శ్రీకాకుళం జిల్లాకు చెందిన గ్రామము. ఈ సినిమా టైటిల్ కూడా అదే పేరుతో పెట్టారు. ప్రతి పాత్రకూ ఓ ఇంటెన్సిటీ ఉంటుంది. అయితే ముందుగా ఈ సినిమాని పెద్ద నటీనటులతో ప్లాన్ చేసినా తర్వాత చిన్న బడ్జెట్ సినిమాగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. మరి సినిమాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి.
నవీకరించబడిన తేదీ – 2023-07-31T12:00:18+05:30 IST