నకిలీ విశ్వవిద్యాలయం: దేశవ్యాప్తంగా 20 నకిలీ విశ్వవిద్యాలయాలు

చివరిగా నవీకరించబడింది:

యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) దేశవ్యాప్తంగా 20 యూనివర్సిటీలను నకిలీ యూనివర్సిటీలుగా గుర్తించింది. ఆయా యూనివర్సిటీలకు పట్టాలు ఇచ్చే అధికారం లేదని ప్రకటించారు. ఆ యూనివర్సిటీలు జారీ చేసే డిగ్రీలతో ఉన్నత విద్య, ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేదని తేల్చి చెప్పింది.

నకిలీ యూనివర్సిటీ: దేశవ్యాప్తంగా 20 నకిలీ యూనివర్సిటీలను గుర్తించిన యూజీసీ.. ఆ రెండూ ఏపీలోనేనా?

నకిలీ విశ్వవిద్యాలయం: యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) దేశవ్యాప్తంగా 20 యూనివర్సిటీలను నకిలీ యూనివర్సిటీలుగా గుర్తించింది. ఆయా యూనివర్సిటీలకు పట్టాలు ఇచ్చే అధికారం లేదని ప్రకటించారు. ఆ యూనివర్సిటీలు జారీ చేసే డిగ్రీలతో ఉన్నత విద్య, ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేదని తేల్చి చెప్పింది. చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించి నిర్వహిస్తున్నారని గుర్తించిన యూజీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఉన్నత విద్య కోసం యూనివర్సిటీల్లో చేరే ముందు యూనివర్సిటీకి యూజీసీ అక్రిడిటేషన్ ఉందో లేదో తనిఖీ చేయాలని యూజీసీ విద్యార్థులను హెచ్చరించింది.

ఆ 20 యూనివర్శిటీల్లో దేశ రాజధాని ఢిల్లీలో 8, ఉత్తరప్రదేశ్‌లో 4, ఆంధ్రప్రదేశ్‌లో 2, పశ్చిమ బెంగాల్‌లో 2, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పుదుచ్చేరిలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. ఇక ఏపీ విషయానికి వస్తే.. ఆ రెండు యూనివర్సిటీలు అంటే గుంటూరు జిల్లా కాకుమానివారితోటలోని క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ, విశాఖపట్నంలోని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా నకిలీ యూనివర్సిటీలుగా తేలింది.

నకిలీ విశ్వవిద్యాలయాల వివరాలు (ఫేక్ యూనివర్సిటీ)..

క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ – ఆంధ్రప్రదేశ్

బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా – ఆంధ్రప్రదేశ్

ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫిజికల్ హెల్త్ సైన్సెస్ – ఢిల్లీ

కమర్షియల్ యూనివర్శిటీ లిమిటెడ్ (దర్యాగంజ్) – ఢిల్లీ

ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం – ఢిల్లీ

ఒకేషనల్ యూనివర్సిటీ – ఢిల్లీ

ADR సెంట్రిక్ జురిడికల్ యూనివర్సిటీ – ఢిల్లీ

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ అండ్ ఇంజినీరింగ్ – ఢిల్లీ

స్వయం ఉపాధి కోసం విశ్వకర్మ ఓపెన్ యూనివర్సిటీ – ఢిల్లీ

మిస్టిక్ యూనివర్సిటీ – ఢిల్లీ

గాంధీ హిందీ విద్యాపీఠ్ – ఉత్తరప్రదేశ్

నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి – ఉత్తరప్రదేశ్

నేతాజీ సుభాష్ చంద్రబోస్ విశ్వవిద్యాలయం – ఉత్తరప్రదేశ్

భారతీయ శిక్షా పరిషత్ – ఉత్తర ప్రదేశ్

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ – పశ్చిమ బెంగాల్

ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్ – పశ్చిమ బెంగాల్

బడగన్వి సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్శిటీ ఎడ్యుకేషన్ సొసైటీ – కర్ణాటక

సెయింట్ జాన్స్ విశ్వవిద్యాలయం – కేరళ

రాజా అరబిక్ విశ్వవిద్యాలయం – మహారాష్ట్ర

శ్రీ బోధి అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ – పుదుచ్చేరి


ఇది కూడా చదవండి:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *