‘అఖండ’ సక్సెస్‌తో ‘అన్‌స్టాపబుల్’ షోతో బాలకృష్ణ లెక్కలు మారిపోయాయి. ఆయన అభిమానుల సంఖ్య రెట్టింపు అయింది. జోష్ పెరిగింది. రెమ్యునరేషన్ విషయంలోనూ బాలయ్య హై. ఇప్పుడు ఆయనతో భారీ విజయాలు అందుకున్న పెద్ద దర్శకులు, యువ దర్శకులు కూడా సినిమాలు చేసేందుకు క్యూ కడుతున్నారు.

‘అఖండ’ సక్సెస్‌తో ‘అన్‌స్టాపబుల్’ షోతో బాలకృష్ణ లెక్కలు మారిపోయాయి. ఆయన అభిమానుల సంఖ్య రెట్టింపు అయింది. జోష్ పెరిగింది. రెమ్యునరేషన్ విషయంలోనూ బాలయ్య హై. ఇప్పుడు ఆయనతో భారీ విజయాలు అందుకున్న పెద్ద దర్శకులు, యువ దర్శకులు కూడా సినిమాలు చేసేందుకు క్యూ కడుతున్నారు. అయితే అలాంటి సమయంలో తనకు ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహా నాయుడు’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన సీనియర్ దర్శకుడు బి గోపాల్‌తో సినిమా చేసేందుకు బాలయ్య ఆసక్తి చూపిస్తున్నాడు. కానీ బాలయ్య మాత్రం అతనితో సినిమా చేస్తానని ముందే చెప్పాడు. అయితే కొత్త తరం నడుస్తున్న తరుణంలో బాలయ్య బి.గోపాల్ తో సినిమా చేయడం రిస్క్ అని నెటిజన్లు భావిస్తున్నారు. బి.గోపాల్ ఎన్నో విజయవంతమైన చిత్రాలు చేసిన సంగతి తెలిసిందే!
2021లో వచ్చిన ‘ఆరడుగుల బుల్లెట్’ సినిమా తర్వాత మరో సినిమా చేయలేదు.. ఓ మంచి సినిమా చేసి రిటైరవ్వాలనేది గోపాల్ కోరిక. ఇదే విషయాన్ని బాలయ్య కూడా వెల్లడించారు. గోపాల్‌తో తనకు ఉన్న అనుబంధానికి, ఇన్ని హిట్‌లు అందించినందుకు కృతజ్ఞతగా గోపాల్ సినిమాకు ఓకే చెప్పాడు బాలకృష్ణ. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చనుందని తెలిసింది. బి.గోపాల్ బాలకృష్ణ ఓ టీమ్‌ని ఏర్పాటు చేసుకుని స్టార్‌డమ్‌కి తగిన కథను సిద్ధం చేసే పనిలో పడ్డారు. ఇలాంటి తరుణంలో బాలయ్య ఈ సినిమా చేయాలనుకున్నా రిస్క్ అయితే.. ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందేనని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ చాలా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇదంతా పూర్తయిన తర్వాత బి.గోపాల్ సినిమా చేస్తాడనే టాక్ వినిపిస్తోంది.
నవీకరించబడిన తేదీ – 2023-08-04T21:17:35+05:30 IST