జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ (JNTUK) కాకినాడ స్పాన్సర్డ్ కేటగిరీ కింద M.Tech, MBA, MCA ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కాకినాడ, నర్సరావుపేట క్యాంపస్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. అకడమిక్ మెరిట్, గేట్ 2023/GPAT 2023/ISET 2023/PGSET 2023 ర్యాంక్, అనుభవం మరియు కౌన్సెలింగ్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. M.Tech ప్రోగ్రామ్ కోసం ప్రతి స్పెషలైజేషన్‌లో ఐదు సీట్లు; MCA ప్రోగ్రామ్‌లో ఐదు సీట్లు; MBA ప్రోగ్రామ్‌లో తొమ్మిది సీట్లు ఉన్నాయి.
ఎంటెక్ విభాగాలు-ప్రత్యేకతలు
-
సివిల్ ఇంజనీరింగ్-స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, సాయిల్ మెకానిక్స్ మరియు ఫౌండేషన్ ఇంజనీరింగ్, హైడ్రాలిక్స్ మరియు వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్
-
ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్-హై వోల్టేజ్ ఇంజనీరింగ్, అడ్వాన్స్‌డ్ ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ డ్రైవ్‌లు, పవర్ ఎలక్ట్రానిక్స్
-
మెకానికల్ ఇంజనీరింగ్ – CAD/CAM, మెషిన్ డిజైన్, థర్మల్ ఇంజనీరింగ్
-
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్-ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్, కంప్యూటర్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, VLSI మరియు ఎంబెడెడ్ సిస్టమ్స్
-
కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్-కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ
-
పునరుత్పాదక శక్తి మరియు పర్యావరణం-పునరుత్పాదక శక్తి, పర్యావరణ ఇంజనీరింగ్ మరియు నిర్వహణ
-
బయోటెక్నాలజీ, నానోటెక్నాలజీ, రిమోట్ సెన్సింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ, ఏవియానిక్స్, ఎన్విరాన్‌మెంటల్ ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ
అర్హత వివరాలు
-
M.Tech ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి, అభ్యర్థులు సంబంధిత ఇంజనీరింగ్ విభాగాల్లో నిర్దేశించిన సబ్జెక్టులతో BE/BTech/AMIE లేదా PG పూర్తి చేసి ఉండాలి. MBBS/BDS/BPharmacy/BVSc ఉత్తీర్ణులు స్పెషలైజేషన్ ప్రకారం దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులందరూ తప్పనిసరిగా గేట్ 2023లో అర్హత సాధించి ఉండాలి.
-
MCA ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి ఏదైనా డిగ్రీ కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్ స్థాయిలో గణితాన్ని ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. ISET 2023 అర్హత కలిగి ఉండాలి. అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
-
MBA ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి సెకండ్ క్లాస్ మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ISET 2023 అర్హత.
ముఖ్యమైన సమాచారం
సెమిస్టర్ ఫీజు: MTech మరియు MCA ప్రోగ్రామ్‌లకు రూ.25000; MBA ప్రోగ్రామ్ కోసం 75000
దరఖాస్తు రుసుము: రూ.1000
దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: ఆగస్టు 31
దరఖాస్తు పంపవలసిన చిరునామా: డైరెక్టర్, అడ్మిషన్స్, JNTUK, కాకినాడ-533003
వెబ్‌సైట్: www.jntuk.edu.in
నవీకరించబడిన తేదీ – 2023-08-18T17:49:05+05:30 IST