కేబుల్ రెడ్డి: ఈ హీరోకి టైటిల్స్ వస్తున్నాయి..

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2023-08-19T11:32:46+05:30 IST

‘కలర్ ఫోటో’, ‘రైటర్ పద్మభూషణ్’, అంబాజీపేట మ్యారేజ్ బ్రాండ్’.. ఈ టైటిల్స్‌కి ఒకదానికొకటి సంబంధం లేదు. హీరో సుహాస్‌కి అలా టైటిల్స్ వచ్చాయి. తాజాగా ఆయన హీరోగా మరో సినిమా ప్రారంభమైంది. ఈ చిత్రానికి ‘కేబుల్ రెడ్డి’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

కేబుల్ రెడ్డి: ఈ హీరోకి టైటిల్స్ వస్తున్నాయి..

కేబుల్ రెడ్డి మూవీ ఓపెనింగ్ పిక్

‘కలర్ ఫోటో’, ‘రైటర్ పద్మభూషణ్’, అంబాజీపేట మ్యారేజ్ బ్రాండ్’.. ఈ టైటిల్స్‌కి అస్సలు సంబంధం లేదు. హీరో సుహాస్‌కి అలా టైటిల్స్ వచ్చాయి. తాజాగా ఆయన హీరోగా మరో సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాకి కూడా మరో డిఫరెంట్ టైటిల్ పెట్టడం చూస్తుంటే ఈ హీరోకి టైటిల్స్ వస్తున్నాయంటూ నెటిజన్లు మాట్లాడుకోవడం విశేషం. ‘కలర్ ఫోటో’, ‘రైటర్ పద్మభూషణ్’ చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న హీరో సుహాస్ ఇప్పుడు కొత్త దర్శకుడు శ్రీధర్ రెడ్డితో మరో అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ కోసం చేతులు కలిపాడు. ఫ్యాన్ మేడ్ ఫిల్మ్స్ పతాకంపై బాలు వల్లు, ఫణి ఆచార్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘కేబుల్ రెడ్డి’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రంలో షాలిని కొండేపూడి కథానాయికగా నటిస్తోంది.

ఇటీవలే ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. శ్రీధర్ రెడ్డి (దర్శకుడు) కెమెరా స్విచ్చాన్ చేయగా.. వరుస ‘హిట్’ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను క్లాప్ కొట్టి మేకర్స్ కి స్క్రిప్ట్ అందించారు. ఈ సినిమా లాంచ్ సందర్భంగా హీరో సుహాస్ మాట్లాడుతూ.. దర్శకుడు శ్రీధర్ మంచి మిత్రుడన్నారు. ఇది అతనికి మొదటి సినిమా. రెండు రోజుల్లో షూటింగ్ ప్రారంభం కానుంది. ఇది అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ చిత్రం. చాలా ఉత్తేజకరమైనది. మరో మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తానన్న నమ్మకం ఉంది అన్నారు. (సుహాస్ నటించిన కేబుల్ రెడ్డి చిత్రం ప్రారంభం)

సుహాస్.jpg

దర్శకుడు శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. ఇది నా మొదటి సినిమా. కథ చాలా ఆసక్తికరంగా ఉంది. అంతే ఆసక్తికరంగా, యంగ్‌గేజ్‌ని చిత్రీకరించడానికి సన్నాహాలు జరిగాయి. ఓ పట్టణంలో జరిగే కథ ఇది. ఇది క్లీన్‌ ఎంటర్‌టైనర్‌ అవుతుంది. తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ పొందుతారనే నమ్మకంతో షూటింగ్‌కి వెళ్తున్నామని చెప్పారు. ఈ అవకాశం ఇచ్చిన దర్శకులకు హీరోయిన్ షాలిని కొండేపూడి కృతజ్ఞతలు తెలిపారు. నిర్మాత బాలు వల్లు మాట్లాడుతూ.. ఇది మా మొదటి సినిమా. చాలా మంచి టీమ్‌తో పని చేస్తున్నాం. బౌండెడ్ స్క్రిప్ట్‌తో షూట్ చేయబోతున్నాం. 20 రోజుల్లో తొలి షెడ్యూల్‌ని పూర్తి చేసేందుకు ప్లాన్‌ చేశామన్నారు. ఈ చిత్రానికి స్మరణ్ సాయి సంగీతం సమకూరుస్తున్నారు.

*******************************************

*******************************************

*******************************************

*******************************************

నవీకరించబడిన తేదీ – 2023-08-19T11:33:30+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *