చంద్రయాన్-3 కంటే ముందే చంద్రుడి దక్షిణ ధ్రువంపై అన్వేషణ ప్రారంభించి సాఫ్ట్ ల్యాండింగ్ చేసి సంచలనం సృష్టించాలనుకున్న రష్యాకు ఊహించని షాక్ తగిలింది. ఆ దేశ అంతరిక్ష పరిశోధనా సంస్థ రోస్కోస్మోస్ ప్రయోగించిన లూనా-25 అంతరిక్ష నౌక జాబిలి ఉపరితలంపై కూలిపోయింది.

చంద్రయాన్-3 కంటే ముందే చంద్రుడి దక్షిణ ధ్రువంపై అన్వేషణ ప్రారంభించి సాఫ్ట్ ల్యాండింగ్ చేసి సంచలనం సృష్టించాలనుకున్న రష్యాకు ఊహించని షాక్ తగిలింది. ఆ దేశ అంతరిక్ష పరిశోధనా సంస్థ రోస్కోస్మోస్ ప్రయోగించిన లూనా-25 అంతరిక్ష నౌక జాబిలి ఉపరితలంపై కూలిపోయింది. ఈ మేరకు రోస్కోమస్ ఆదివారం అధికారిక ప్రకటన విడుదల చేశారు. అదుపు తప్పిన కక్ష్య వల్లే ప్రమాదం జరిగిందని వివరించింది.
ఆగస్ట్ 21న సాఫ్ట్ ల్యాండింగ్ కారణంగా శనివారం 11.10 గంటలకు (GMT) అంతరిక్ష నౌకను ప్రీ-ల్యాండింగ్ కక్ష్యలో ఉంచడానికి మిషన్ కంట్రోల్ ప్రయత్నించింది. ఈ ప్రయత్నంలో అసాధారణ పరిస్థితులు తలెత్తాయి. ఆపరేషన్ సమయంలో ఆటోమేటిక్ స్టేషన్‌లో అసాధారణ పరిస్థితి ఎదురైంది. దీని కారణంగా, యుక్తి ప్రక్రియను పూర్తి చేయడం సాధ్యం కాలేదు” అని రోస్కోమస్ శాస్త్రవేత్తలు తెలిపారు. రోస్కోమస్ లూనా-25 అంతరిక్ష నౌకను దాని ముందు ల్యాండింగ్ కక్ష్యలోకి తిరిగి తీసుకురావడంలో సమస్య ఉందని ప్రకటించిన ఒక రోజు తర్వాత క్రాష్ జరిగింది.
లూనా-25 వ్యోమనౌక అనూహ్య కక్ష్యలోకి ప్రవేశించి దాని నుండి మళ్లించడానికి విఫలయత్నం చేయడంతో చంద్రుని ఉపరితలంపై కూలిపోయిందని రోస్కోమస్ వివరించారు. దాదాపు 47 ఏళ్ల తర్వాత చంద్రుడి పరిశోధన కోసం రష్యా చేపట్టిన ప్రయోగం ఇదే కావడం గమనార్హం. ఈ వ్యోమనౌక రేపు (సోమవారం) చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయనుంది. ఈ పరిణామం ఒకరోజు ముందే జరగడం గమనార్హం.
నవీకరించబడిన తేదీ – 2023-08-20T15:22:03+05:30 IST