రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న ‘ఆర్‌సి 16’ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ను అందించారు దర్శకుడు బుచ్చిబాబు సానా. ‘ఉప్పెన’ చిత్రానికి జాతీయ అవార్డు వచ్చిన సందర్భంగా దర్శకుడు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘ఆర్‌సి 16’ సినిమా గురించిన అప్‌డేట్‌ను అందించారు.
రామ్ చరణ్ కథానాయకుడిగా రూపొందుతున్న ‘ఆర్‌సి 16’ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ను దర్శకుడు బుచ్చిబాబు సానా తెలియజేశారు. స్క్రిప్ట్ పూర్తయింది. ఇతర ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. డిసెంబర్, జనవరి మధ్యలో షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారురూ . ‘ఉప్పెన’ చిత్రానికి జాతీయ అవార్డు వచ్చిన సందర్భంగా దర్శకుడు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘ఆర్‌సి 16′ సినిమా గురించిన అప్‌డేట్‌ను అందించారు. అందరి అంచనాలను మించి ఈ సినిమా ఉంటుందని అన్నారు. ‘‘రామ్ చరణ్ తో నేను చేయబోయే సినిమా రా, పల్లెటూరిగా ఉంటుందని, ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారని, కథ రాసేటప్పుడు ఆయనే సంగీతం అందిస్తే బాగుంటుందని భావించి, ఆయన్ను సంప్రదించి కథ చెప్పడంతో ఓకే ఇచ్చారు.ఇప్పటి వరకు చాలా కథలు విన్నాను కానీ ఇలాంటివి ఎప్పుడూ వినలేదు.తప్పకుండా మ్యూజిక్ చేస్తాను’ అన్నారు.ఇది స్పోర్ట్స్ డ్రామా అని అందరూ అనుకుంటారు.కానీ ఈ సినిమా వారి అంచనాలను మించి ఉంటుంది. నాలుగేళ్లుగా ఈ కథపై వర్క్ చేస్తున్నాం.జనవరిలో షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు.
ప్రస్తుతం రామ్ చరణ్ టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో నటిస్తున్నాడు. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఇది రూపొందుతోంది. ఇందులో చరణ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడని సమాచారం. కైరా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా, అంజలి, శ్రీకాంత్, ఎస్జే సూర్య, సునీల్, సముద్రఖని, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.
నవీకరించబడిన తేదీ – 2023-08-26T16:50:11+05:30 IST