రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానుల దృష్టంతా ప్రభాస్ రాబోయే పాన్ ఇండియా చిత్రం ‘సాలార్’ పైనే ఉంది. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులే కాదు సినీ ప్రియులు కూడా ఎదురుచూస్తున్నారు. ‘కేజీఎఫ్’ సిరీస్ చిత్రాల తర్వాత హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న చిత్రంపై ఆకాశమే హద్దుగా అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను అందుకునేలా విడుదలైన పోస్టర్లు, టీజర్లతో… ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌కు లేని, సాధించలేని విజయాన్ని ‘సాలార్’ కచ్చితంగా ప్రభాస్‌కు అందిస్తుందని అభిప్రాయపడుతున్నారు అభిమానులు.. కానీ ఆ యూనిట్ ఎప్పుడూ నిరాశ పరుస్తుంది. ఈ సినిమా అప్ డేట్స్ చూసి ఫ్యాన్స్ ఎంత డిజప్పాయింట్ అయ్యారో తెలియంది కాదు.. ఇప్పుడు ఓ వార్త మరింత నిరాశకు గురి చేస్తోంది.
నిజానికి ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 28న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.దాదాపు 100 రోజుల ముందే సినిమా రిలీజ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. దాంతో సినిమా వాయిదా పడిందనే వార్తలు (#Postponed) కనిపించకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. సెప్టెంబర్ నుంచి ఈ సినిమా డిసెంబర్‌కి వాయిదా పడిందని ట్విట్టర్‌లో వార్తలు వస్తున్నాయి. సీజీ వర్క్ పట్ల దర్శకుడు అసంతృప్తిగా ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. సీజీ వర్క్ కారణంగా ఓ కొలిక్కి రాకపోతే వాయిదా వేయాలనే నిర్ణయంలో యూనిట్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అందుకే ఈ సినిమా ట్రైలర్‌కి సంబంధించి మేకర్స్ నుంచి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. ఇప్పుడు విడుదల వాయిదాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కానీ ‘సాలార్’ డిసెంబర్ కి వెళితే సినిమాల విడుదల విషయంలో గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. గతంలో రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ విడుదల విషయంలోనూ ఇదే గందరగోళం నెలకొంది. అప్పుడు కూడా సినిమాల విడుదల విషయంలో నిర్మాతలు సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు ‘సాలార్’తో మళ్లీ అలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం లేకపోలేదు.
==============================
****************************************
****************************************
****************************************
****************************************
*************************************
నవీకరించబడిన తేదీ – 2023-09-01T20:13:26+05:30 IST