IND Vs PAK: వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే టీమ్ ఇండియా పరిస్థితి ఏంటి?

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2023-09-02T12:40:55+05:30 IST

శ్రీలంకలోని క్యాండీలో ఈరోజు ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. మ్యాచ్‌లో 90 శాతం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నివేదిక ఇచ్చింది. దీంతో హై ఓల్టేజీ మ్యాచ్‌ను రద్దు చేసే అవకాశాన్ని అంపైర్లు తోసిపుచ్చలేరు.

IND Vs PAK: వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే టీమ్ ఇండియా పరిస్థితి ఏంటి?

శ్రీలంకలోని క్యాండీ వేదికగా నేడు జరగనున్న భారత్-పాక్ మ్యాచ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాదు క్యాండీలో ఈరోజు ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మ్యాచ్ జరిగే సమయానికి వర్షం కురిసినా.. లేదా వర్షం కారణంగా ఆడే పరిస్థితులు లేకపోయినా హైవోల్టేజీ మ్యాచ్ ను రద్దు చేసే అవకాశాన్ని అంపైర్లు కొట్టిపారేయలేరు. మరి అదే జరిగితే టీమ్ ఇండియా సూపర్-4 దశకు అర్హత సాధిస్తుందా?

ఇది కూడా చదవండి: క్రికెట్ న్యూస్: వరల్డ్ కప్ జట్టులో ట్రాన్స్ జెండర్.. చరిత్రలో ఇదే తొలిసారి

వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే అంపైర్లు భారత్, పాక్ జట్లకు ఒక్కో పాయింట్ కేటాయిస్తారు. ఇప్పటికే నేపాల్ ను ఓడించిన పాకిస్థాన్.. టీమిండియాతో మ్యాచ్ రద్దయినా సూపర్-4 దశకు చేరుకుంటుంది. సూపర్-4 బెర్త్ కోసం భారత్ నేపాల్‌తో తలపడాలి. నేపాల్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్ కచ్చితంగా గెలవాలి. మరి కొద్ది సేపటి తర్వాత వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం కలిగితే, అంపైర్లు డక్‌వర్త్ లూయిస్ పద్ధతిని ఉపయోగిస్తారు. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం మ్యాచ్ ఫలితం తేలినా.. ఇరు జట్లకు కనీసం 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసే అవకాశం ఉండాలి. లేదంటే ఈ మ్యాచ్ ఫలితాన్ని పరిగణనలోకి తీసుకోలేం. మొదట బ్యాటింగ్ చేసే జట్టు పూర్తి ఓవర్లు ఆడి, ఛేజింగ్ మధ్యలో వర్షం పడితే, తొలి ఇన్నింగ్స్ స్కోరు ఛేజింగ్‌లో బౌల్ చేయాల్సిన ఓవర్ల శాతంతో గుణించబడుతుంది. దీని ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు.

నవీకరించబడిన తేదీ – 2023-09-02T12:43:10+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *