వర్షం ప్రభావంతో నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షపు నీటితో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి.

హైదరాబాద్‌లో భారీ వర్షం
హైదరాబాద్‌లో భారీ వర్షం: హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరంలో భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. నగరంలో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
దీంతో హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, కృష్ణానగర్, ఫిల్మ్ నగర్, అమీర్ పేట్, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, షేక్ పేట్, మణికొండ, రాయదుర్గం, మెహిదీపట్నం, టోలీచౌకి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో భారీ వర్షం కురుస్తోంది. చింతల్, సుచిత్ర, జీడిమెట్ల, బాలానగర్, కూకట్ పల్లి సహా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.
భారీ వర్షాలు: తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు
వర్షం ప్రభావంతో నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షపు నీటితో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. నగరంలో కురుస్తున్న వర్షంతో జీహెచ్‌ఎంసీ, ఈవీడీఎంలను అప్రమత్తం చేశారు. జీహెచ్‌ఎంసీ, ఈవీడీఎం తమ పరిధిలో ఏమైనా సమస్యలుంటే ఫిర్యాదు చేయాలని కోరారు.
040-21111111 లేదా 9000113667 నంబర్లకు ఫిర్యాదు చేయాలని అధికారులు తెలిపారు.హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో రెండు మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
పత్తి పంట : వర్షాకాలంలో పత్తిలో అనుసరించాల్సిన పద్ధతులు
గంటకు 30 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. రెండు రోజుల పాటు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఎల్లుండి పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.