ఆస్ట్రేలియా క్రికెట్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సచిన్ టెండూల్కర్‌ను అధిగమించి సరికొత్త రికార్డు సృష్టించాడు.
డేవిడ్ వార్నర్ రికార్డ్: ఆస్ట్రేలియన్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ మరో ఘనతను సాధించాడు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 46వ సెంచరీ సాధించి సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో వార్నర్ సెంచరీ సాధించాడు. అతను 93 బంతుల్లో 3 సిక్స్‌లు, 12 ఫోర్లతో 113.97 స్ట్రైక్ రేట్‌తో 106 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు 46 సెంచరీలు సాధించాడు. వన్డేల్లో 20, టెస్టుల్లో 21, టీ20ల్లో ఒక సెంచరీ చేశాడు.
ప్రపంచ క్రికెట్‌లో ఓపెనర్‌గా అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా డేవిడ్ వార్నర్ ఇటీవల రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. ఓపెనర్‌గా సచిన్ 45 సెంచరీలు సాధించాడు. కానీ ఇవన్నీ వన్డేల్లోనే సాధించడం విశేషం. ఓవరాల్ గా అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్ మెన్ జాబితాలో ఇంగ్లండ్ ప్లేయర్ జోరూట్ తో పాటు వార్నర్ 11వ స్థానంలో కొనసాగుతున్నాడు. జోరూట్ టెస్టుల్లో 30 సెంచరీలు, వన్డేల్లో 16 సెంచరీలు చేశాడు.
రోహిత్ శర్మ, స్టీవెన్ స్మిత్ 10వ స్థానంలో ఉన్నారు. రోహిత్ వన్డేల్లో 30, టెస్టుల్లో 10, టీ20ల్లో 4 సెంచరీలు సాధించాడు. స్మిత్ టెస్టుల్లో 32 సెంచరీలు, వన్డేల్లో 12 సెంచరీలు చేశాడు. అత్యధిక సెంచరీల జాబితాలో సచిన్ (100), విరాల్ కోహ్లీ (76), రికీ పాంటింగ్ (71), కుమార సంగక్కర (63), కలిస్ (62) టాప్ 5లో కొనసాగుతున్నారు.
అలాగే, వార్నర్ మాథ్యూ హేడెన్‌ను అధిగమించి ఆస్ట్రేలియా తరఫున అత్యధిక ODI పరుగులు చేసిన ఎనిమిదో స్థానంలో నిలిచాడు. వార్నర్ 144 వన్డేల్లో 45.11 సగటుతో 6,136 పరుగులు చేశాడు. ఇందులో 20 సెంచరీలు, 27 అర్ధసెంచరీలు ఉన్నాయి. ODIల్లో అతని వ్యక్తిగత అత్యధిక స్కోరు 179. హేడెన్ 160 ODIల్లో 10 సెంచరీలు మరియు 36 అర్ధసెంచరీలతో 44.10 సగటుతో 6,131 పరుగులు చేశాడు.
ఇది కూడా చదవండి: జట్టుకు దూరమైనా గుడిలో పూజలు చేసిన శిఖర్ ధావన్.. ఏం కోరుకున్నాడో తెలుసా..?