ఆపరేషన్ వాలెంటైన్: మెగా ప్రిన్స్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ తాజా అప్‌డేట్

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2023-09-13T21:37:45+05:30 IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తెలుగు-హిందీ ద్విభాషా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. వాస్తవ సంఘటనల నుండి ప్రేరణ పొంది, భారతీయ వైమానిక దళం యొక్క శౌర్యాన్ని ప్రదర్శించే ఈ మోస్ట్ ఎవెయిటింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో వరుణ్ తేజ్ ధైర్యవంతుడైన ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా నటించాడు. తాజాగా ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభమైనట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఆపరేషన్ వాలెంటైన్: మెగా ప్రిన్స్ 'ఆపరేషన్ వాలెంటైన్' తాజా అప్‌డేట్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెలుగు-హిందీ ద్విభాషా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. వాస్తవ సంఘటనల నుండి ప్రేరణ పొంది, భారతీయ వైమానిక దళం యొక్క శౌర్యాన్ని ప్రదర్శించే ఈ మోస్ట్ ఎవెయిటింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో వరుణ్ తేజ్ ధైర్యవంతుడైన ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా నటించాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ అప్‌డేట్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు బుధవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైనట్లు మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, వీఎఫ్ఎక్స్ వర్క్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. బెస్ట్ అవుట్‌పుట్ మరియు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని ప్రేక్షకులకు అందించడానికి టీమ్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు నిర్మాతలు తెలిపారు. అక్టోబర్ 8 ఎయిర్‌ఫోర్స్ డే సందర్భంగా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. (మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ అప్‌డేట్)

Operation.jpg

హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానున్న ఈ విజువల్ వండర్ తో వరుణ్ తేజ్ హిందీలో అరంగేట్రం చేస్తున్నాడు. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మానుషి చిల్లర్ రాడార్ ఆఫీసర్‌గా నటించింది. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ సంయుక్తంగా సందీప్ ముద్దా భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. నందకుమార్ అబ్బినేని సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

==============================

****************************************

****************************************

నవీకరించబడిన తేదీ – 2023-09-13T21:37:45+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *