చంద్రబాబుకు కూడా హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో చంద్రబాబుకు ఏసీబీ కోర్టులోనూ, హైకోర్టులోనూ ఒకేసారి రెండు ఎదురు దెబ్బలు తగిలినట్లు తెలుస్తోంది.

చంద్రబాబు..ఏపీ హైకోర్టు
చంద్రబాబు పిటిషన్‌ను రద్దు చేసిన ఏపీ హైకోర్టు: చంద్రబాబుకు హైకోర్టులోనూ ఎదురుదెబ్బ తగిలింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో చంద్రబాబుకు ఏసీబీ కోర్టులోనూ, హైకోర్టులోనూ ఒకేసారి రెండు ఎదురు దెబ్బలు తగిలినట్లు తెలుస్తోంది. హైకోర్టులో కూడా క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో ఊరట లభించలేదు. పిటిషన్ కొట్టివేయడంతో ఏసీబీ కోర్టులో కస్టడీ పిటిషన్‌కు లైన్ క్లియర్ అయింది.
మరోవైపు ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో సీఐడీ న్యాయవాదుల వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. రిమాండ్ రద్దు చేయాలని కోరుతూ చంద్రబాబు సెప్టెంబర్ 13న క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వకుండా అన్యాయంగా అరెస్ట్ చేశారని పలు విషయాలను ప్రస్తావించారు.
చంద్రబాబు రిమాండ్: చంద్రబాబు రిమాండ్ మరో రెండు రోజులు పొడిగింపు.. జడ్జితో బాబు ఏమన్నారు?
చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూత్రా, హరీశ్ సాల్వేలు వాదించారు. అలాగే సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వాదించారు. చంద్రబాబుకు రిమాండ్ అవసరం లేదని, కోర్టులో అనేక కేసులు వేశారని లూత్రా అన్నారు. అయితే సీఐడీ లాయర్ వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఎట్టకేలకు చంద్రబాబుకు షాక్ ఇస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. నాలుగు రోజుల క్రితమే తీర్పుని వెలువరించినా కోర్టు తీర్పును వెల్లడించకుండా రిజర్వ్‌లో ఉంచింది. తాజాగా ఈరోజు తీర్పు వెలువరించగా.. క్వాష్ పిటిషన్ ను కొట్టివేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో ఏసీడీ కోర్టులో కస్టడీ పిటిషన్‌కు లైన్ క్లియర్ అయింది.