ప్రతిపక్షాలను కేసుల పేరుతో వేధిస్తున్నారు. దొంగ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని లోకేష్ ధ్వజమెత్తారు. నారా లోకేష్

నారా లోకేష్ – సీఎం జగన్
నారా లోకేష్ – సీఎం జగన్: ఏపీ సీఎం జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. చంద్రబాబును తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారన్నారు. అక్రమ కేసులతో ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. మళ్లీ యువగళం పాదయాత్ర ప్రారంభిస్తానని చెప్పినందుకే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తనను ఏ-14గా చేర్చారని లోకేష్ ధ్వజమెత్తారు. ఆరు నెలల్లో జగన్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని నారా లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొద్ది రోజులుగా ఢిల్లీలో ఉన్న నారా లోకేష్ ఈరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. చంద్రబాబు అరెస్ట్ కేసు, ఏపీలో పరిస్థితిని రాష్ట్రపతికి వివరించారు. ప్రభుత్వంపై జగన్ రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు.
కేసులో పేరు చెప్పి వేధింపులు..
రాష్ట్రపతితో భేటీ అనంతరం నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఏపీలో 2019 నుంచి ప్రతిపక్ష పార్టీలపై, ప్రజలపై జరుగుతున్న అరాచకాలను రాష్ట్రపతికి వివరించినట్లు లోకేష్ తెలిపారు. స్కిల్ డెవలప్‌మెంట్ పథకంలో అవినీతి జరగకపోయినా చంద్రబాబును అరెస్ట్ చేశారని రాష్ట్రపతికి తెలిపారు. ప్రతిపక్షాలను కేసుల పేరుతో వేధిస్తున్నారని రాష్ట్రపతికి వివరించారు. రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారని, ఏపీలో పరిస్థితిని తెలుసుకుంటానని చెప్పారని లోకేష్ వెల్లడించారు. ఏపీలో ప్రతిపక్షాలు, సామాన్యుల గొంతుకలను ప్రభుత్వం అణచివేయాలని చూస్తోందని లోకేష్ మండిపడ్డారు.
ఆ కేసులతో నాకు ఎలాంటి సంబంధం లేదు.
మా పోరాటం ఆగదని, మా పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని లోకేష్ అన్నారు. నిన్న యువగళం పాదయాత్ర ప్రారంభిస్తానని ప్రకటించిన వెంటనే నన్ను కానుకగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏ-14గా పెట్టారని లోకేష్ ధ్వజమెత్తారు. ఆరు నెలల్లో ఎన్నికలు వస్తాయని, సీఎం జగన్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే బాధ్యత నేనే స్వయంగా తీసుకుంటానని లోకేష్ తేల్చి చెప్పారు.
ఢిల్లీకి వచ్చి నన్ను అరెస్టు చేసే అధికారం అధికారులకు లేదా? అని సీఐడీ అధికారులను లోకేష్ ప్రశ్నించారు. అంటే కేసులో ఏమీ లేదని తేలిపోయింది. కేసులో ఏదైనా ఉంటే ఎక్కడికైనా వెళ్లి అరెస్టులు చేసే అధికారం అధికారులకు ఉందన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్‌మెంట్ కేసులతో నాకు ఎలాంటి సంబంధం లేదని లోకేష్ తేల్చేశారు.
జగన్ భయపడిపోయాడు..
న్యాయ పోరాటం కోసమే ఢిల్లీకి వచ్చానని లోకేష్ అన్నారు. ఢిల్లీలో న్యాయవాదులు, రాజకీయ పార్టీల నేతలను కలిసి ఏపీలో జరుగుతున్న పరిస్థితులను వివరిస్తున్నట్లు తెలిపారు. అసలు ఇన్నర్ రింగ్ రోడ్డు లేదన్నారు లోకేష్. అందులోని కేసు ఏంటో అర్థం కావడం లేదన్నారు. భవిష్యత్తు హామీ, యువగళం, వారాహి యాత్రలకు ప్రభుత్వం భయపడి మాపై దొంగ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తోందని లోకేష్ ధ్వజమెత్తారు.
న్యాయం ఆలస్యమైనా విజయం ఖాయం..
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీఐడీ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని లోకేష్ అన్నారు. కక్ష సాధింపులో తప్ప ఏ విషయంలోనూ చంద్రబాబు పాత్ర లేదని స్పష్టం చేశారు. ఏ ఒక్క కేసులోనూ నాకు, నా కుటుంబానికి, నా సన్నిహితులకు ఒక్క పైసా కూడా రాలేదన్నారు. ప్రజల్లోకి వెళ్లకుండా రకరకాల కుట్రలు చేస్తున్నామని సీరియస్ అయ్యారు. సీఐడీ ఆరోపించిన కంపెనీలతో మాకు ఎలాంటి సంబంధం లేదని, వాటితో కప్పు టీ కూడా తాగలేదని లోకేశ్ పేర్కొన్నారు. న్యాయం ఆలస్యమవుతుందనడం సరికాదన్నారు లోకేష్.
ఇది కూడా చదవండి..హీరో సుమన్: చంద్రబాబు అరెస్ట్ పై నటుడు సుమన్ వ్యాఖ్యలు.. ఇదే గుణపాఠం..