#MadhapurDrugsCase #MadhapurDrugsCase తెలంగాణ నార్కోటిక్స్ బృందం ఈరోజు తెలుగు సినీ పరిశ్రమ నటుడు నవదీప్‌ను విచారించింది. అయితే ఈ విచారణలో నవదీప్‌కి పలు ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. నార్కోటిక్స్ విభాగం ఎస్పీ సునీతారెడ్డి, ఏసీపీ నరసింగరావుతో కూడిన బృందం నవదీప్‌ను విచారించినట్లు సమాచారం. ఆరు గంటలకు పైగా విచారణ కొనసాగింది. ఈ దర్యాప్తు బృందం నవదీప్ ముందు గట్టి సాక్ష్యాలను ఉంచి ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. నారోటిక్స్ కంట్రోల్ బ్యూరో
అయితే నవదీప్ మాత్రం చాలా ప్రశ్నలకు సమాధానాలు దాటవేసినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ సరఫరా చేసే రామచందర్‌తో తనకు పదేళ్లుగా పరిచయం ఉందని, అయితే ఆర్థిక లావాదేవీలు మినహా డ్రగ్స్‌తో సంబంధం లేదని నవదీప్ చెప్పాడు. పబ్‌లలో జరిగిన పార్టీలలో రాంచందర్, నవదీప్‌ల ఫోటోలు కూడా చూపించారని, దానికి నవదీప్ తనను స్నేహితుడిగా మాత్రమే కలిశానని చెప్పాడని సమాచారం. నార్కోటిక్ పోలీస్
ఈ నెల 14న మాదాపూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నార్కోటిక్స్ అధికారులు, పోలీసులు కలిసి సుమారు కోటి రూపాయల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుని, నలుగురు నైజీరియన్లు, సినీ దర్శకుడు, మరో నలుగురిని అరెస్టు చేశారు. రాంచందర్ అనే వ్యక్తి డ్రగ్స్ సరఫరా చేసేవాడని, అతడితో నవదీప్‌కు సంబంధాలు ఉన్నాయని పోలీసులు ఆరోపిస్తున్నారు. అందుకే ఈరోజు నవదీప్ ను నార్కోటిక్స్ పోలీసులు సుమారు ఆరు గంటల పాటు విచారించిన సంగతి తెలిసిందే.
అయితే బయటకు వచ్చిన తర్వాత తనకు డ్రగ్స్ తో ఎలాంటి సంబంధం లేదని, తానెప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని నవదీప్ చెబుతున్నాడు. అయితే తనకు డ్రగ్స్ సరఫరా చేసే రాంచందర్ తెలుసునని, అయితే అతడితో డ్రగ్స్ తీసుకోలేదని, అది కూడా పదేళ్ల క్రితం నాటి విషయమని నవదీప్ చెబుతున్నాడు. గతంలో పబ్ నిర్వహించినప్పుడు తనపై ఆరోపణలు చేశారని, అప్పుడు కూడా తనను పిలిచి విచారించారని చెప్పారు. వారు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానమిచ్చానని చెప్పారు. పాత ఫోన్ రికార్డులు తీసుకుని విచారణ చేపట్టామన్నారు. అవసరమైతే మళ్లీ ఫోన్ చేస్తామని కూడా నవదీప్ చెప్పాడు.
నవీకరించబడిన తేదీ – 2023-09-23T18:24:33+05:30 IST