మంత్రి కేటీఆర్: ఎన్టీఆర్‌కు అసాధ్యం.. ఆయన శిష్యుడు కేసీఆర్ చేయబోతున్నాడు

భారతదేశంలో తెలుగు వారు ఉన్నారని గుర్తించిన ఘనత ఎన్టీఆర్‌దే. చరిత్రలో మహనీయుని స్థానం ఎప్పటికీ చిరస్మరణీయం.

మంత్రి కేటీఆర్: ఎన్టీఆర్‌కు అసాధ్యం.. ఆయన శిష్యుడు కేసీఆర్ చేయబోతున్నాడు

మంత్రి కేటీఆర్

మంత్రి కేటీఆర్ ఖమ్మం టూర్ : ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఖమ్మం నగరంలోని లకారం ట్యాంక్‌బండ్‌ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ పార్కును మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఎన్టీఆర్ అంటే రాముడు, కృష్ణుడు అని అన్నారు. ఎన్టీఆర్ పార్క్ ను నా చేతుల మీదుగా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు.

Read Also : మంత్రి శ్రీనివాస్ గౌడ్: పాలమూరులో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్..

భారతదేశంలో తెలుగు వారు ఉన్నారని గుర్తించిన ఘనత ఎన్టీఆర్‌దే. చరిత్రలో మహనీయుని స్థానం ఎప్పటికీ చిరస్మరణీయం. ఎన్టీఆర్‌కు ఆదరణ కంటే ముందు సీఎం పదవి కూడా చాలా తక్కువ. తారక రామారావు పేరులోనే అధికారం ఉందన్నారు మంత్రి కేటీఆర్. ఎన్టీఆర్ శిష్యుడిగా దేశ వ్యాప్తంగా కేసీఆర్ తెలంగాణ అస్తిత్వాన్ని చాటుకున్నారు. తెలంగాణ పౌరుషాన్ని చాటిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు. సౌత్ ఇండియాలో ఇప్పటి వరకు ఎన్టీఆర్ సహా ఎవరూ సీఎంగా హ్యాట్రిక్ సాధించలేదు. ఎన్టీఆర్ శిష్యుడిగా త్వరలో సీఎం కేసీఆర్ కు సాధ్యమవుతుందని కేటీఆర్ అన్నారు.

Read Also: బీఆర్ఎస్ పార్టీ: బీఆర్ఎస్ పార్టీలో ఎందుకు చేరారు.. ఎందుకు వెళ్లిపోతున్నారు?

ఖమ్మం పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ తొలుత కొణిజర్ల మండలం అంజనాపురంలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఆయిల్ పామ్ సాగుతో లాభాలున్నాయన్నారు. ఈ ప్రాంత రైతులు ఫ్యాక్టరీని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని కేటీఆర్ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *