మంత్రి శ్రీనివాస్ గౌడ్: పాలమూరులో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్..

తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఉన్నాయా అని నరేంద్ర మోదీ ప్రశ్నించారు. పాలమూరు రైతులు బాగుపడుతున్నా చూడలేకపోతున్నారు.

మంత్రి శ్రీనివాస్ గౌడ్: పాలమూరులో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్..

మంత్రి శ్రీనివాస్ గౌడ్

PM Narendra Modi Palamuru Tour : అక్టోబరు 1న పాలమూరు జిల్లాలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు.పాలమూరు వేదికగా పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. మోదీ పర్యటన సందర్భంగా రాష్ట్ర బీజేపీ నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, పాలమూరులో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనపై స్థానిక మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు. ఏ ముఖం పెట్టుకుని పాలమూరుకు వస్తున్నారని ప్రశ్నించారు. గతంలో ఇక్కడ సభ నిర్వహించి జాతీయ హోదాపై హామీ ఇచ్చారు. హామీని నెరవేర్చక పోయినా మళ్లీ ప్రధాని అక్కడే సభ నిర్వహిస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు.

Read Also : మంత్రి కేటీఆర్ ఖమ్మం టూర్: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటన.. షెడ్యూల్ ఇలా..

ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని పార్లమెంట్ సాక్షిగా చెప్పి.. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, హామీలు నెరవేర్చకున్నా మళ్లీ అక్కడ సభ పెట్టుకునే అవకాశం మోదీ కల్పించారన్నారు. తెలంగాణా ఏర్పాటుపై ప్రధాని మోదీ ఎందుకు విషం కక్కారని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. ప్రాజెక్టులకు డబ్బులు ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసిందన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాను తేల్చడం లేదన్నారు. మోదీ సభా వేదిక నుంచి కరివెన, ఉద్దండాపూర్ రిజర్వాయర్లు, మెడికల్ కాలేజీ, ఐటీ టవర్ కనిపిస్తాయని, హైదరాబాద్‌కు ప్రత్యామ్నాయంగా మహబూబ్ నగర్‌ను అభివృద్ధి చేస్తున్నారని, మోదీ పాలమూరు అభివృద్ధిని చూడాలని శ్రీనివాస్ గౌడ్ సూచించారు.

Read Also : ఈరోజు బంగారం ధర: వరుసగా నాలుగో రోజు తగ్గిన బంగారం ధర.. పెరిగిన వెండి ధర.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..

తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఉన్నాయా అని నరేంద్ర మోదీని ప్రశ్నించారు. పాలమూరు రైతులు బాగుపడుతున్నా చూడలేకపోతున్నారు. కృష్ణా, తుంగభద్ర నదులు ప్రవహిస్తున్నా తాగునీరు, సాగునీరు లేక పాలమూరు ఘోష లేదు. తెలంగాణలో కులం, మతం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు మోదీ వస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *