వైఎస్ షర్మిలారెడ్డి స్థాపించిన వైఎస్‌ఆర్‌టీపీకి కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలే గుర్తును కేటాయించింది. ఈ మేరకు బైనాక్యులర్ గుర్తును ఫిక్స్ చేశారు.

తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. నవంబర్ 30న పోలింగ్ జరగనుంది.ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంపై దృష్టి సారించాయి. తమ పార్టీ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఈ ఎన్నికలతో తొలిసారిగా బరిలోకి దిగుతున్న వైఎస్ షర్మిలారెడ్డి పార్టీ వైఎస్ఆర్టీపీకి తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తును కేటాయించింది. ఈ మేరకు బైనాక్యులర్ గుర్తును ఫిక్స్ చేశారు. 119 నియోజకవర్గాల్లో ఒకే గుర్తును కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అభ్యర్థులను ప్రకటించి తమ బైనాక్యులర్ బ్రాండ్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైఎస్‌ఆర్‌టీపీ కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఇది కూడా చదవండి: RGV : ‘నేను బయట.. లోపల ఉన్నాడు’.. ఆడుకుంటున్న టీడీపీ శ్రేణులు!!
2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాల్లోకి ప్రవేశించిన వైఎస్ షర్మిలారెడ్డి.. ఏపీలో ఉన్న వైఎస్ జగన్‌తో విభేదాలతో తెలంగాణ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. యువజన కార్మిక రైతు తెలంగాణ పార్టీ (వైఎస్‌ఆర్‌టీపీ)ని ప్రకటించి ప్రజా సమస్యలపై పోరాడారు. తెలంగాణలో 3,800 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన తొలి భారతీయ మహిళగా షర్మిల ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా చేరారు. కాగా, తాను స్థాపించిన వైఎస్సార్‌సీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు వైఎస్ షర్మిలారెడ్డి విశ్వప్రయత్నాలు చేశారు. ఈ మేరకు పలుమార్లు ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్ గాంధీలతో చర్చలు జరిపారు. అయితే కాంగ్రెస్‌లో వైఎస్‌ఆర్‌టీపీ విలీనానికి సంబంధించి దాదాపు నాలుగు నెలలు వేచి చూసినా షర్మిలకు కాంగ్రెస్ నుంచి ఆశించిన స్పందన రాలేదు. దీంతో షర్మిల ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. 119 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. ఈ ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేస్తున్నట్లు షర్మిల ఇప్పటికే స్పష్టం చేశారు.
నవీకరించబడిన తేదీ – 2023-10-26T20:45:54+05:30 IST