ఈ వారం కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు ఆటుపోట్లకు గురయ్యే అవకాశం ఉంది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ముగిసే వరకు మార్కెట్లో అనిశ్చితి కొనసాగుతుంది. ముడి చమురు ధరలు మరియు కార్పొరేట్ కంపెనీల ఆర్థిక ఫలితాలు సూచీల కదలికను నిర్దేశిస్తాయి. నిఫ్టీ 19,100 వద్ద కన్సాలిడేట్ అయితేనే బుల్లిష్‌నెస్ వస్తుంది. కొద్దిరోజుల పాటు ఇదే స్థాయిలో కొనసాగితే అప్ ట్రెండ్ ను కొనసాగించే అవకాశం ఉంది.
అమెరికా బాండ్ రాబడులు పెరగడంతో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను భారీగా ఉపసంహరించుకుంటున్నారు. అలాంటి సమయంలో ఆకర్షణీయమైన ధరల్లో లభించే బలమైన కంపెనీల షేర్లను కొనుగోలు చేయడం మంచిది.
స్టాక్ సిఫార్సులు
కెనరా బ్యాంక్: మార్కెట్ అంచనాలకు అనుగుణంగా ఆర్థిక ఫలితాలు రావడంతో ఈ కౌంటర్లో వాల్యూమ్స్ పెరిగాయి. గత వారం చివరి రెండు సెషన్లలో ఈ స్టాక్ ఏకంగా 13 శాతం పెరిగింది. గత శుక్రవారం ఈ షేరు రూ.380.70 వద్ద ముగిసింది. వ్యాపారులు ఈ స్టాక్‌ను రూ.410-465 టార్గెట్ ధరతో రూ.280 స్థాయిల వద్ద కొనుగోలు చేయడాన్ని పరిగణించవచ్చు. కానీ రూ.365 స్థాయిని ఫర్మ్ స్టాప్ లాస్ గా ఉంచాలి.
SBI కార్డ్: జూలై నుంచి ఈ షేరు తిరోగమన ధోరణిలో ఉంది. ఈ కౌంటర్లో విపరీతమైన విక్రయాలతో బేస్ ఏర్పడుతోంది. మరోవైపు ఆర్థిక ఫలితాలు వెలువడడంతో ఈ కౌంటర్లో కొనుగోళ్ల హడావిడి నెలకొంది. గత శుక్రవారం ఈ షేరు రూ.796.50 వద్ద ముగిసింది. వ్యాపారులు స్టాక్‌ను రూ. 790 స్థాయిలలో రూ. 825-880 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. కానీ రూ.770 స్థాయిని స్టాప్‌లాస్‌గా ఉంచాలి.
ఆల్కెమ్ లేబొరేటరీస్: జూన్ త్రైమాసిక ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఈ షేర్ నష్టాల బాటలో పయనిస్తోంది. తాజాగా సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల తేదీ సమీపిస్తున్న తరుణంలో ఈ షేరులో జోరు కనిపిస్తోంది. గత శుక్రవారం ఈ షేరు రూ.3,687 వద్ద ముగిసింది. వ్యాపారులు ఈ స్టాక్‌ను రూ.3,650 స్థాయిల వద్ద ఒక స్థానం తీసుకొని రూ.3,730-3,820 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. కానీ రూ.3,610 స్థాయిని స్టాప్‌లాస్‌గా ఉంచాలి.
HCL టెక్: ఐటీ రంగం స్తబ్దుగా ఉన్నా ఈ స్టాక్‌పై ఇన్వెస్టర్ల అంచనాలు ఏమాత్రం తగ్గడం లేదు. రెండవ త్రైమాసిక ఫలితాలు మెరుగ్గా ఉండటం మరియు డివిడెండ్ తేదీ సమీపిస్తున్నందున గత రెండు సెషన్‌లలో వాల్యూమ్ పెరిగింది. గత శుక్రవారం ఈ షేరు రూ.1,267.50 వద్ద ముగిసింది. వ్యాపారులు రూ.1,320-1,390 టార్గెట్ ధరతో రూ.1,260 వద్ద స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు. కానీ రూ.1,240 స్థాయిని ఫర్మ్ స్టాప్ లాస్‌గా ఉంచాలి.
శ్రీరామ్ ఫైనాన్స్: నిఫ్టీతో పోలిస్తే ఈ కౌంటర్ మెరుగైన పనితీరు కనబరుస్తోంది. మార్కెట్ అంచనాలను మించిన ఆర్థిక ఫలితాలు, డివిడెండ్ ప్రకటన కారణంగా గత శుక్రవారం మంచి లాభంతో రూ.1,937.60 వద్ద ముగిసింది. వ్యాపారులు రూ.1,965-2,100 టార్గెట్ ధరతో రూ.1,900 వద్ద కొనుగోలు చేయవచ్చు. కానీ రూ.1,860 స్థాయిని స్టాప్‌లాస్‌గా ఉంచాలి.
– మూర్తి నాయుడు పాదం,
మార్కెట్ నిపుణులు,
నిఫ్టీ మాస్టర్
గమనిక: పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు పెట్టుబడిదారులు తమ ఆర్థిక సలహాదారులను సంప్రదించాలి.