రాజకీయ పార్టీలకు విరాళాలు ఎక్కడి నుంచి వస్తాయో తెలుసుకునే హక్కు పౌరులకు లేదని కేంద్రం స్పష్టం చేసింది.
పార్టీలకు సంబంధించిన ఎలక్టోరల్ బాండ్ల పథకంలో దాత పేరు రహస్యంగా ఉంచాలి
డొనేషన్ వైట్ మనీ.. సుప్రీంకోర్టుకు అటార్నీ జనరల్ నివేదిక
న్యూఢిల్లీ, అక్టోబర్ 30: రాజకీయ పార్టీలకు విరాళాలు ఎక్కడి నుంచి వస్తాయో తెలుసుకునే హక్కు పౌరులకు లేదని కేంద్రం స్పష్టం చేసింది. సహేతుకమైన ఆంక్షలు లేకుండా ఏదైనా.. ప్రతిదీ తెలుసుకునే సాధారణ హక్కు ఉండకూడదని అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి పేర్కొన్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టుకు ఒక ప్రకటనను సమర్పించింది. అందులో ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని ఆయన గట్టిగా సమర్థించారు. పార్టీలకు రాజకీయ విరాళంగా స్వచ్ఛమైన తెల్లధనం అందుతుందన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1A) ప్రకారం, రాజకీయ విరాళాలు ఎవరు ఇస్తున్నారో తెలుసుకునే హక్కు పౌరులకు లేదు. ఈ బాండ్ పథకం ప్రకారం.. దాత పేరు గోప్యంగా ఉంచాలి. అన్ని పన్నులకు లోబడి తెల్లధనం మాత్రమే విరాళంగా ఇవ్వబడుతుంది. ప్రభుత్వ చర్య ఇప్పటికే ఉన్న హక్కులను ఉల్లంఘించినప్పుడు మాత్రమే రాజ్యాంగ న్యాయస్థాన సమీక్ష జరగాలి. పైగా ప్రభుత్వ నిర్ణయంలో ప్రత్యేక హక్కు అంటూ ఏమీ లేదని.. తాము ఊహించిన ఫలానా కోణాన్ని అందులో పొందుపర్చి ఉండాల్సింది అంటే దాన్ని సమీక్షించకూడదన్నమాట. రాజకీయ పార్టీలకు విరాళాలకు ప్రజాస్వామ్య ప్రాధాన్యత ఉంది. పాలనలో పలుకుబడి, ప్రభావానికి అతీతంగా జవాబుదారీతనం ఉండాలనే డిమాండ్ వచ్చిందని.. రాజ్యాంగంలో చట్టపరమైన నిబంధనలు లేనందున.. ఇలాంటి విషయాల్లో కోర్టులు ఉత్తర్వులు జారీ చేసే దిశగా ముందుకు వెళ్లకూడదని పేర్కొన్నారు. న్యాయ సమీక్షకు ఉన్న అధికారం ప్రభుత్వ విధానాలను పరిశీలించి ఉత్తమమైన వాటిని సూచించడం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో రాజకీయ పార్టీలకు నగదు రూపంలో విరాళాలు వచ్చేవి. ఇందులో కేంద్రం 2018 జనవరి 2 నుంచి పారదర్శకతను తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సవాల్ చేస్తూ పలు పార్టీలు, వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. మధ్యంతర స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఈ విషయాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం ఈ వ్యాజ్యాలను విచారించనుంది.
నవీకరించబడిన తేదీ – 2023-10-31T03:24:00+05:30 IST