సుధీర్ బాబు నటించిన పాన్ ఇండియా చిత్రం ‘హరోమ్ హర’. ‘సెహరి’ ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, ఎస్ఎస్సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో దేవిగా హీరోయిన్గా నటిస్తున్న మాళవిక శర్మను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్.

హరోమ్ హరలో మాళవిక శర్మ
‘పవర్ ఆఫ్ సుబ్రమణ్యం’ నవంబర్ 22న విడుదల కానుంది. దానికి ముందు సుధీర్ బాబు పాన్ ఇండియా చిత్రం ‘హరోమ్ హర’ నిర్మాతలు ప్రధాన పాత్రధారులను పరిచయం చేస్తున్నారు. ‘సెహరి’ ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, ఎస్ఎస్సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర్ సినిమాస్) బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో దేవి హీరోయిన్గా మాళవిక శర్మను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్.
ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో మాళవిక చీరలో అందంగా, సంప్రదాయబద్ధంగా కనిపిస్తోంది. ఆమె సుబ్రహ్మణ్య స్వామి ముందు నిలబడి నవ్వుతూ ఉంది. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో సునీల్ ఓ కీలక పాత్రలో నటిస్తుండగా.. తాజాగా ఆయన క్యారెక్టర్ పోస్టర్ ను విడుదల చేశారు. (హరోమ్ హర నుండి మాళవిక శర్మ ఫస్ట్ లుక్)
చిత్తూరు జిల్లా కుప్పంలో 1989 నేపథ్యంలో సాగే ‘హరోమ్ హర’ కథలో సుధీర్ బాబు కుప్పం యాసలో డైలాగ్స్ చెప్పనున్నారు. ఈ చిత్రానికి టాప్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. ఈ చిత్రానికి అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. ది రివోల్ట్.. అనేది ‘హరోమ్ హర’ ట్యాగ్ లైన్. సుధీర్‌బాబు కెరీర్లోనే హై బడ్జెట్ మూవీగా ఇది రూపొందుతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
ఇది కూడా చదవండి:
========================
*************************************
*************************************
*************************************
*************************************
నవీకరించబడిన తేదీ – 2023-11-16T12:32:58+05:30 IST