ఆదికేశవ: ఊరమాస్ లుక్‌తో అదరగొట్టబోతున్న వైష్ణవ్ తేజ్.. ఆదికేశవ ట్రైలర్ విడుదల..

ఆదికేశవ: ఊరమాస్ లుక్‌తో అదరగొట్టబోతున్న వైష్ణవ్ తేజ్.. ఆదికేశవ ట్రైలర్ విడుదల..

ఆదికేశవ సినిమా ట్రైలర్ వివరాలు

ఆది కేశవ:వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటించిన తాజా చిత్రం “ఆదికేశవ`. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ మూవీస్ బ్యానర్‌పై నిర్మించనున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఈసారి ఫుల్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ప్ర‌స్తుతం ఫుల్ ప్ర‌మోష‌న్స్‌లో ఉన్న మూవీ టీం.. తాజాగా ఓ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేసి ఈ మూవీ థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ని విడుద‌ల చేసింది. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ఉద్యోగం లేకుండా కష్టాల్లో కూరుకుపోయే అబ్బాయి, అమ్మాయిని ప్రేమించి, ఆపై పెద్ద సమస్య ఎదుర్కొనే కథాంశంతో ఈ సినిమా రాబోతోందని అర్ధమవుతోంది. మొదటి భాగం హీరోయిన్ శ్రీలితో ఇంటెన్స్ లవ్ ట్రాక్ తో మొదలైంది. ఆ తర్వాత ఫుల్ మాస్ యాంగిల్ తీసుకున్నాడు. ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు వైష్ణవ్ తేజ్ ఊరమాస్ గా మారాడు. తనదైన హీరోయిజంతో ఆకట్టుకున్నాడు. ఈ స్టోరీ రిఫ్రెష్‌గా ఉంటుందని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. హీరో-హీరోయిన్ లవ్ ట్రాక్ కి ట్రైలర్ కొత్త అనుభూతిని కలిగిస్తుంది. హీరోయిన్ తో కామెడీ రొమాన్స్ చేస్తూ కనిపించిన హీరో.. సెకండాఫ్ ట్రైలర్ వచ్చేసరికి విలన్లపై శివతాండవం ఆడుతూ కనిపించాడు. యాక్షన్ సీక్వెన్స్ కూడా మాస్ గా తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

నిర్మాతలు మాట్లాడుతూ వైష్ణవ్ తేజ్ గత చిత్రాలతో పోల్చారు. ఇక ట్రైలర్ లోనే తన క్యూట్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకుల మనసు దోచుకుంది శ్రీలీల. ఈ సినిమాలో మలయాళ స్టార్ నటుడు ‘జోజు జార్జ్’ విలన్‌గా నటించబోతున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకరా స్టూడియోస్ బ్యానర్‌లపై రూపొందుతున్న ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. వైష్ణవ్ తేజ్.. `ఉప్పెన` సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. తొలి సినిమాతోనే 100 కోట్లు వసూలు చేసిన హీరోగా నిలిచాడు. ఆ తర్వాత “కొండపొలం`, “రంగరంగ వైభవంగా` చిత్రాలతో వచ్చాడు. అయితే ఈ రెండు సినిమాలు ఆడలేదు. దీంతో ఇప్పుడు యువ దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో ఈ సరికొత్త లవ్ అండ్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను రూపొందించారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి. ఈ నెల 24న ఈ సినిమా విడుదల కానుంది.

 

పోస్ట్ ఆదికేశవ: ఊరమాస్ లుక్‌తో అదరగొట్టబోతున్న వైష్ణవ్ తేజ్.. ఆదికేశవ ట్రైలర్ విడుదల.. మొదట కనిపించింది ప్రైమ్9.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *