వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి చవిచూస్తున్న టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగలనుంది. గాయం కారణంగా ప్రపంచకప్ నుంచి మధ్యలోనే నిష్క్రమించిన టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు.

వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి చవిచూస్తున్న టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగలనుంది. గాయం కారణంగా ప్రపంచకప్ నుంచి మధ్యలోనే నిష్క్రమించిన టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు. అతను కోలుకోవడానికి మరో 4 నెలలు పడుతుంది. ఈ విషయాన్ని ఓ జాతీయ క్రీడా వెబ్‌సైట్ తన కథనంలో పేర్కొంది. నివేదిక ప్రకారం, హార్దిక్ పాండ్యా మళ్లీ ఐపీఎల్‌లోనే మైదానంలోకి వస్తాడు. ఐపీఎల్ 2024లోనే హార్దిక్ పాండ్యా మళ్లీ క్రికెట్ ఆడే అవకాశాలు ఉన్నాయని జాతీయ మీడియా పేర్కొంది. ఇదే నిజమైతే టీమ్ ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. వచ్చే నెలలో జరిగే దక్షిణాఫ్రికా పర్యటనతో పాటు స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు హార్దిక్ పాండ్యా అందుబాటులో ఉండడు.
ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా గైర్హాజరు ఇప్పటికే స్పష్టంగా కనిపించింది. హార్దిక్ పాండ్యా ఫైనల్లో ఆడితే టీమిండియా గెలిచి ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా టీమ్ ఇండియా టీ20 జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. 2024 ద్వితీయార్థంలో జరిగే టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశాలు కూడా ఉన్నాయి.ఇలాంటి సమయంలో హార్దిక్ పాండ్యా జట్టుకు దూరమవడం ఆందోళన కలిగించే అంశమే అని చెప్పాలి. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా గత నెలలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా గాయపడిన సంగతి తెలిసిందే. చీలమండ గాయం కారణంగా బెంగళూరులోని ఎన్‌సీఏలో చేరాడు. అతను నాకౌట్ మ్యాచ్‌ల కోసం జట్టులోకి వస్తాడని గతంలో వార్తలు వచ్చాయి కానీ అది జరగలేదు. దక్షిణాఫ్రికా పర్యటన నాటికి కోలుకుని జట్టులోకి వస్తాడని అంతా భావించారు. కానీ ఇప్పుడు అది జరిగేలా కనిపించడం లేదు.
నవీకరించబడిన తేదీ – 2023-11-22T10:51:38+05:30 IST