మిజో నేషనల్ ఫ్రంట్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి సహా మంత్రులందరూ ఓడిపోయారు.
మిజోరాం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. ఫలితాల్లో జోరామ్ పీపుల్స్ మూవ్ మెంట్ అభ్యర్థులు భారీ విజయం సాధించారు. మిజో నేషనల్ ఫ్రంట్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి సహా మంత్రులందరూ ఓడిపోయారు.
లైవ్‌బ్లాగ్ ముగిసింది.
ప్రత్యక్ష వార్తలు & నవీకరణలు
-
04 డిసెంబర్ 2023 05:13 PM (IST)
ఇవీ మిజోరాం తుది ఫలితాలు
మిజోరం అసెంబ్లీ ఎన్నికల తుది ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ పూర్తి ఆధిక్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. కాగా, అధికార మిజో నేషనల్ ఫ్రంట్ పార్టీ పరాజయం పాలవడంతో ప్రతిపక్షానికే పరిమితమైంది. ఇక జాతీయ పార్టీల ప్రభావం ఈ ఎన్నికల్లో ఏమాత్రం పని చేయలేదు. బీజేపీ, కాంగ్రెస్‌లు కనీస సంఖ్యకు పడిపోయాయి
పార్టీల వారీగా సీట్ల వివరాలు
మొత్తం సీట్లు – 40, మ్యాజిక్ ఫిగర్ – 21
ZPM – 27
MNF – 10
బీజేపీ – 2
కాంగ్రెస్ – 1
-
04 డిసెంబర్ 2023 03:11 PM (IST)
ఎలక్షన్ కమిషన్ డేటా ప్రకారం, జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ ఇప్పటివరకు 26 స్థానాల్లో విజయం సాధించగా, మరో స్థానంలో ఆధిక్యంలో ఉంది. MNF 7 స్థానాల్లో విజయం సాధించి 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ రెండు సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది. ఇప్పటి వరకు 35 సీట్ల ఫలితాలు వెలువడ్డాయి. మిజోరాంలో మొత్తం 40 సీట్లు ఉన్నాయి.
-
04 డిసెంబర్ 2023 03:10 PM (IST)
ముఖ్యమంత్రి ఓటమి పాలయ్యారు
మిజోరాం ముఖ్యమంత్రి ఐజ్వాల్ ఈస్ట్-1 స్థానం నుంచి ఘోరంగా ఓడిపోయారు. జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ అభ్యర్థి లాల్తన్‌సంగ ఆయనపై గెలుపొందారు. ఆయన 2,101 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
-
04 డిసెంబర్ 2023 12:15 PM (IST)
మిజోరంలో ZPM అధికారం దిశగా అడుగులు వేస్తోంది.
మిజోరం ఎన్నికల ఫలితాల్లో ZPM ట్రెండ్ కొనసాగుతోంది. ఆ పార్టీ నుంచి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలుపొందగా.. 17 మంది ఎమ్మెల్యేలు ఇంకా ఆధిక్యంలో ఉన్నారు. ఎంఎన్‌ఎఫ్ నుంచి ఒకరు గెలుపొందగా, 10 మంది ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ నుంచి ఒకరు గెలుపొందగా.. ఒక బీజేపీ ఎమ్మెల్యే ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే ముందంజలో ఉన్నారు.
-
04 డిసెంబర్ 2023 10:22 AM (IST)
మిజోరాం అసెంబ్లీ ఎన్నికల్లో తుయిచాంగ్ అసెంబ్లీ స్థానం నుంచి ZPM అభ్యర్థి డబ్ల్యూ చువాన్వామా విజయం సాధించారు. రెండు రౌండ్ల కౌంటింగ్ ముగిసేసరికి 909 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
-
04 డిసెంబర్ 2023 10:09 AM (IST)
ZPM ముఖ్యమంత్రి అభ్యర్థి లాల్దుహోమా సెర్చ్‌చిప్‌లో మొత్తం 1992 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
-
04 డిసెంబర్ 2023 10:07 AM (IST)
మిజోరం ఎన్నికల ఫలితాల్లో ప్రతిపక్ష జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ (జెడ్‌పిఎం) పార్టీ 22 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అధికార మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్‌ఎఫ్) 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ, కాంగ్రెస్‌లు అన్ని స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.
-
04 డిసెంబర్ 2023 08:33 AM (IST)
మిజోరాం అసెంబ్లీలోని 40 స్థానాలకు మొత్తం 174 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
-
04 డిసెంబర్ 2023 08:32 AM (IST)
#చూడండి | కోసం ఓట్ల లెక్కింపు #మిజోరాం ఎన్నికలు 2023 మొదలైంది. ఐజ్వాల్‌లోని కౌంటింగ్ కేంద్రం నుండి దృశ్యాలు. pic.twitter.com/ZkGZDziI9Z
– ANI (@ANI) డిసెంబర్ 4, 2023
-
04 డిసెంబర్ 2023 08:31 AM (IST)
కట్టుదిట్టమైన భద్రత మధ్య ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది
-
04 డిసెంబర్ 2023 08:28 AM (IST)
మిజోరంలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 2750 మంది అధికారులు ఓట్ల లెక్కింపులో నిమగ్నమయ్యారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రారంభమైంది.
-
04 డిసెంబర్ 2023 08:27 AM (IST)
లెక్కింపు ప్రక్రియలో 4 వేల మందికి పైగా సిబ్బంది పాల్గొన్నారు. ఈవీఎంల కోసం మొత్తం 399 టేబుళ్లు, పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు 56 టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
-
04 డిసెంబర్ 2023 08:26 AM (IST)
40 స్థానాలున్న మిజోరాంలో నవంబర్ 7న ఎన్నికలు జరిగాయి. ఇవాళ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రధానంగా అధికార ఎంఎన్‌ఎఫ్‌తోపాటు జెడ్‌పిఎం, కాంగ్రెస్ పార్టీలు పోటీ చేశాయి. దీంతో ఈసారి ఎవరు అధికారం ఇస్తారనే ఆసక్తి ప్రజల్లో నెలకొంది.