PituRooms: ప్రపంచంలోనే అత్యంత సన్నని హోటల్

ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన ఓ హోటల్ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఇది ప్రపంచంలోనే అత్యంత సన్నని హోటల్‌గా పేరుగాంచింది.

PituRooms: ప్రపంచంలోనే అత్యంత సన్నని హోటల్

ప్రపంచంలోనే అత్యంత సన్నగా ఉండే హోటల్

ప్రపంచంలోని అత్యంత సన్నగా ఉండే హోటల్..పిటూరూమ్స్ : ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల హోటళ్లు ఉన్నాయి. వాటిలో కొన్ని అత్యాధునిక సౌకర్యాలు..మరికొన్ని లగ్జరీ, సూపర్ లగ్జరీ..ఇంకొన్ని వ్యూపాయింట్లకు ప్రత్యేకం. ఒక్కో హోటల్‌కి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది.

తాజాగా ఓ హోటల్ ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. విలాసమా..? సూపర్ లగ్జరీ..? అంతే కాకుండా ఈ హోటల్ నిర్మాణం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఎందుకంటే ఈ హోటల్ ప్రపంచంలోనే అత్యంత సన్నని హోటల్‌గా పేరుగాంచింది. అతి చిన్న స్థలంలో నిర్మించిన హోటల్‌గా ఈ హోటల్ ప్రసిద్ధి చెందింది. ఇండోనేషియాలోని సెంట్రల్ జావాలోని సలాటిగా టౌన్‌లో నిర్మించిన “పిటూరూమ్స్” హోటల్ ప్రపంచంలోనే అతి చిన్న స్థలంలో నిర్మించిన అతిపెద్ద భవనం.

ఇండోనేషియా ఆర్కిటెక్ట్ అరి ఇంద్ర ఈ హోటల్ సృష్టికర్త. అతను సెంట్రల్ జావాలోని సలాటిగా నగరంలో పెరిగాడు. ఆర్కిటెక్ట్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇండోనేషియా రాజధాని జకార్తా, సింగపూర్‌లో అనేక భవనాలను నిర్మించిన ఆర్కిటెక్ట్‌గా పేరు పొందారు. ఈ క్రమంలో సెంట్రల్ జావాలో అత్యంత సన్నని హేటల్‌ను నిర్మించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఈ హోటల్‌ను ప్రపంచ రికార్డు సాధించేందుకు నిర్మించలేదని, సలాతి అనే చిన్న పట్టణం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించిందని అరి ఇంద్ర చెప్పారు.

సలాటిగలో 2022లో నిర్మించబడిన ఈ హోటల్ కేవలం తొమ్మిది అడుగుల వెడల్పు, 17 మీ (55 అడుగులు) ఎత్తు మరియు 9.5 మీటర్ల పొడవు ఉంటుంది. ఈ భవనంలో ఏడు గదులు మరియు ఒక చిన్న లాంజ్ ఉన్నాయి. ఇంటీరియర్ లేఅవుట్ అద్భుతంగా ఉంది. ఒక ప్రవేశ లాబీ, భవనం పైభాగంలో ఒక చిన్న బహిరంగ టెర్రేస్ ప్రాంతం బార్ మరియు రెస్టారెంట్‌ను కలిగి ఉంది.

హోటల్ గదుల మధ్య ఉన్న మెట్లు మరియు అలంకరణ వస్తువులు చక్కని రూపంతో ఆకర్షిస్తాయి. హోటల్‌లో ప్రత్యేకించి వికలాంగుల కోసం చిన్న లిఫ్ట్ కూడా ఉంది. ఈ భవనంలోని ఏడు గదులు విభిన్న థీమ్‌లతో ఆకర్షణీయంగా ఉన్నాయి. ఒక్కో గది ఒక్కో రంగు థీమ్‌తో ప్రత్యేకంగా ఉంటుంది. ఈ గదుల్లో సౌకర్యాలు కూడా చాలా బాగున్నాయి. డబుల్ బెడ్, టీవీ, షవర్, సింక్, టాయిలెట్‌తో కూడిన బాత్‌రూమ్‌ వంటి సౌకర్యాలకు కొదవలేదు.

ఇక్కడ మంచి ఆహారం, మంచి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని ఈ హోటల్ ఆర్కిటెక్ట్ ఇంద్ర చెప్పారు. మంచి జీవన ప్రమాణాలున్న నగరంగా సాలతిగ పేరు తెచ్చుకుందన్నారు. గతంలో డచ్ వాసులకు ఇది వారాంతపు పర్యాటక ప్రదేశంగా ఉండేదని..ఇండోనేషియన్లు విశ్రాంతి తీసుకోవడానికి సలాటిగను మంచి ప్రదేశంగా భావిస్తున్నారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *