‘ముండాసు పట్టి’ ఫేమ్ మధురై మోహన్ (76) కన్నుమూశారు. అనారోగ్యంతో శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 40 ఏళ్లుగా సినీ పరిశ్రమలో కొనసాగి ‘ముండాసు పట్టి’ సినిమాతో వెలుగులోకి వచ్చిన నటుడు మోహన్. సొంతూరు మధురై. దీంతో చిత్ర పరిశ్రమలో మదురై మోహన్‌గా స్థిరపడ్డాడు.

నటుడు మధురై మోహన్
‘ముండాసు పట్టి’ ఫేమ్ మధురై మోహన్ (76) కన్నుమూశారు. అనారోగ్యంతో శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 40 ఏళ్లుగా సినీ పరిశ్రమలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ ‘ముండాసుపట్టి’ సినిమాతో వెలుగులోకి వచ్చిన నటుడు మోహన్, సొంతూరు మదురై. దీంతో చిత్ర పరిశ్రమలో మదురై మోహన్‌గా స్థిరపడ్డాడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఆయన తుది శ్వాస విడిచారు.
నాలుగు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్నా తనకు గుర్తింపు, పేరు తెచ్చిన చిత్రం రామ్ కుమార్ దర్శకత్వంలో విష్ణు విశాల్ నటించిన ‘ముండాసు పట్టి’. ఆ తర్వాత ఏఆర్కే శరవణన్ దర్శకత్వంలో వచ్చిన ‘వీరన్’ సినిమాలో తన నటనతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నాడు. తన కెరీర్‌లో ఎక్కువ భాగం గ్రామీణ నేపథ్య చిత్రాలలో నటించాడు. ఆయన మరణ వార్తను నటుడు కాళీ వెంకట్ శనివారం ‘ఎక్స్’ వేదికపై వెల్లడించారు. (ముండాసుపట్టి మధురై మోహన్ కన్నుమూశారు)
మధురై మోహన్ శనివారం ఉదయం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు. 40 ఏళ్లుగా గుర్తింపు లేని నటుడిగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, మోహన్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
ఇది కూడా చదవండి:
====================
****************************************
*******************************
****************************************
నవీకరించబడిన తేదీ – 2023-12-10T17:36:49+05:30 IST