కేరళలో పినరయి విజయన్ ప్రభుత్వం, గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ మధ్య వివాదం ముదిరింది. సోమవారం గవర్నర్ ఆరిఫ్ ఢిల్లీ వెళ్లేందుకు తిరువనంతపురం విమానాశ్రయానికి వస్తున్నారు, ఆయనతో పాటు అధికార సీపీఎం సభ్యుడు కూడా ఉన్నారు.
సీఎం విజయన్ కుట్రేనన్ ఆరిఫ్ ఖాన్
న్యూఢిల్లీ, డిసెంబర్ 12: కేరళలో పినరయి విజయన్ ప్రభుత్వం, గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ మధ్య వివాదం ముదిరింది. ఢిల్లీకి వెళ్లేందుకు తిరువనంతపురం విమానాశ్రయంలో గవర్నర్ ఆరిఫ్ కాన్వాయ్‌పై అధికార సీపీఎం పార్టీకి చెందిన ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు సోమవారం దాడి చేశారు. నల్లజెండాలు ప్రదర్శిస్తూ గవర్నర్ కారుపైకి దూసుకెళ్లారు. ఈ ఘటనపై గవర్నర్ ఆరీఫ్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నివేదిక అడిగారనే నెపంతో సీఎం విజయన్ తనపై కుట్ర పన్నారని, విద్యార్థి సంఘాల నేతలతో తన కారుపై దాడి చేయించారని అన్నారు. ‘‘విశ్రాంత ఉద్యోగులకు పింఛన్లు ఇచ్చే పరిస్థితి లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్వయంగా హైకోర్టులో అఫిడవిట్ సమర్పించారు.. దీని అర్థం ఏమిటి? రాష్ట్రం ఆర్థికంగా ఎమర్జెన్సీలో ఉంది! అందుకే అడిగాను. అందుకే నాపై దాడి చేశారు’’ అని గవర్నర్ ఆరోపించారు. గవర్నర్ కారుపై దాడి ఘటనను సీరియస్‌గా తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి వి.మురళీధరన్ తెలిపారు. నవ కేరళను నిర్మిస్తున్నట్లు సీఎం విజయన్ పదే పదే చెబుతున్నారు. అతను హమాస్ ఉగ్రవాదులను (SFI విద్యార్థులను) న్యూ కేరళకు ఆహ్వానించాడు. గవర్నర్ అంటే భయపడుతున్నారు” అని అన్నారు. మరోవైపు గవర్నర్ కాన్వాయ్‌పై దాడి కేసులో 17 మంది విద్యార్థులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వారిలో ఏడుగురిని అరెస్టు చేశారు. ఇదిలావుంటే కాంగ్రెస్, బీజేపీ తదితర ప్రతిపక్షాలు విజయన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. ఎస్‌ఎఫ్‌ఐ నిరసనలు సిగ్గుమాలిన చర్యగా శశి థరూర్ అభివర్ణించారు.
నవీకరించబడిన తేదీ – 2023-12-13T06:26:23+05:30 IST