ఢిల్లీ : నిన్నటి వరకు కాలుష్యం.. ఇప్పుడు పొగమంచు.. దేశ రాజధానిలో చల్లటి వాతావరణం

ఢిల్లీ : నిన్నటి వరకు కాలుష్యం.. ఇప్పుడు పొగమంచు.. దేశ రాజధానిలో చల్లటి వాతావరణం

ఢిల్లీ: నిన్నటి వరకు తీవ్ర వాయుకాలుష్యంతో అల్లాడుతున్న దేశ రాజధాని ఢిల్లీ ప్రస్తుతం చలితో వణికిపోతోంది. చల్లటి వాతావరణం కారణంగా దేశ రాజధాని అతలాకుతలమవుతోంది. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. చలి తీవ్రతతో ఢిల్లీ వాసులు వణికిపోతున్నారు. చలి గాలుల కారణంగా నగరంలో కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. మరోవైపు ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు దృశ్యమానతను దాదాపు సున్నాకి తగ్గించింది. దీంతో ఢిల్లీలో తెల్లవారుజామున కూడా చీకట్లు అలుముకున్నాయి. వాహనదారులు లైట్లు వెలిగించుకోవాలి. ఓ వైపు చలి తీవ్రత మరోవైపు ఢిల్లీ వాసులు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు.

ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ మరియు ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో ఉత్తర భారతదేశం అంతటా చల్లని గాలులు వీస్తున్నాయి. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ మరియు ఉత్తర మధ్యప్రదేశ్‌లలో ఉదయం 5:15 గంటలకు పొగమంచు వేగంగా వ్యాపిస్తున్నట్లు తెలిపే ఉపగ్రహ చిత్రాన్ని కూడా వాతావరణ శాఖ విడుదల చేసింది. శాటిలైట్ చిత్రాల ప్రకారం, పంజాబ్, హర్యానా-చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తర రాజస్థాన్, ఉత్తర మధ్యప్రదేశ్ మరియు ఆనుకుని ఉన్న మధ్య భారతదేశంతో సహా వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో దట్టమైన పొగమంచు ఏర్పడింది. దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీలోని సఫర్‌జంగ్‌లో 50 మీటర్లకు, పాలంలో 125 మీటర్లకు దృశ్యమానత తగ్గింది. పంజాబ్‌లోని అమృత్‌సర్ విమానాశ్రయంలో విజిబిలిటీ సున్నాకి పడిపోయింది. అలాగే, ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ, లక్నో, ప్రయాగ్‌రాజ్‌తో సహా కొన్ని చోట్ల విజిబిలిటీ 25 మీటర్లకు, రాజస్థాన్‌లోని గంగానగర్‌లో 50 మీటర్లకు పడిపోయింది. దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీలో వాహనదారులు లైట్లు వేసుకుని వాహనాలు నడుపుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

నవీకరించబడిన తేదీ – డిసెంబర్ 27, 2023 | 08:33 AM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *