ఇప్పటికే ట్విటర్‌ను కొనుగోలు చేసిన ప్రముఖ బిలియనీర్ ఎలోన్ మస్క్ మరో కంపెనీ వొడాఫోన్ ఐడియాలో వాటా తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కంపెనీ షేర్లు భారీ స్థాయిలో పెరిగాయి. ఈ క్రమంలో సంస్థ ఈ మేరకు క్లారిటీ ఇచ్చింది.
కొత్త సంవత్సరం 2024 మొదటి రోజున, వోడాఫోన్ ఐడియా లిమిటెడ్ షేర్లు స్టాక్‌లలో భారీ పెరుగుదలను చూశాయి. అయితే ఇది పెరగడానికి కారణం ఉందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. బిలియనీర్ ఎలాన్ మస్క్ వొడాఫోన్ షేర్ని కొనుగోలు చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అతను తన శాటిలైట్ ఇంటర్నెట్ కంపెనీ అయిన స్టార్‌లింక్‌కు బాధ్యతలు తీసుకుంటున్నట్లు పుకారు ఉంది.
అంతేకాదు, వోడాఫోన్ ఐడియాలో ఎలోన్ మస్క్ 33% వాటాను తీసుకోనున్నట్లు పుకార్లు ఉన్నాయి. దీంతో వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ షేరు కొత్త సంవత్సరం తొలిరోజున రూ.18.42 వద్ద 52 వారాల గరిష్ఠ స్థాయిని తాకింది. అయితే ఈ పరిణామంపై భారత్‌లో మూడో అతిపెద్ద టెలికాం సర్వీస్ ప్రొవైడర్ అయిన వొడాఫోన్ నుంచి సెబీ వివరణ కోరింది. దీనిపై వోడాఫోన్ స్పందిస్తూ.. ప్రస్తుతం అలాంటి చర్చలేమీ లేవని తెలిపింది. ప్రస్తుతం వస్తున్న వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. అయితే, వోడాఫోన్ ఐడియా వివరణ తర్వాత, జనవరి 2, మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు కంపెనీ షేర్లు ఐదు శాతం పడిపోయి రూ. 16.20 వద్ద ట్రేడవుతున్నాయి.
రెండు సెషన్లలో ఈ స్టాక్ భారీ డెలివరీ-ఆధారిత కొనుగోళ్లను చూసింది. ఈ నేపథ్యంలో గత రెండు ట్రేడింగ్ రోజుల్లో షేరు 28.3% జంప్ చేసింది. డిసెంబర్ 28న రూ.13.25 నుంచి జనవరి 1న రూ.17కి పెరగడం విశేషం. సోమవారం ఇంట్రాడే గరిష్టం రూ.18.42. ఈ క్రమంలో రూ.3,095.6 కోట్ల ట్రేడెడ్ విలువతో ఎన్ఎస్ఈలో టాప్ ట్రేడెడ్ స్టాక్‌గా అవతరించింది. ఇది BHEL మరియు యెస్ బ్యాంక్ వంటి దిగ్గజాల కంటే ముందుంది.
మరోవైపు స్టార్‌లింక్ ఇప్పటికే శాటిలైట్ సర్వీసెస్ (GMPCS) లైసెన్స్ ద్వారా గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్స్ కోసం దరఖాస్తు చేసింది. త్వరలో మంజూరు అయ్యే అవకాశం ఉంది. ఇది బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించడానికి ఉపగ్రహాల వినియోగాన్ని అనుమతిస్తుంది. టెలికమ్యూనికేషన్స్ చట్టం శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించడానికి స్పెక్ట్రమ్ యొక్క పరిపాలనాపరమైన కేటాయింపులను అనుమతిస్తుంది.
నవీకరించబడిన తేదీ – జనవరి 02, 2024 | 05:14 PM