లావణ్య త్రిపాఠి: పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి దర్శనం ఇలా..

ABN
, ప్రచురణ తేదీ – జనవరి 03, 2024 | 06:02 PM

లావణ్య త్రిపాఠి గతేడాది మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ని పెళ్లాడిన సంగతి తెలిసిందే. పెళ్లయ్యాక నటన నుంచి తప్పుకుంటారా? లేదా? అన్నదానిపై క్లారిటీ లేదు కానీ.. పెళ్లికి ముందు చేసిన ప్రాజెక్టులను పూర్తి చేసే పనిలో పడింది. తాజాగా ఆమె ఓ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించబోతోంది. ‘మిస్ పర్ఫెక్ట్’ పేరుతో ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్‌ని మేకర్స్ ఇటీవల విడుదల చేశారు.

లావణ్య త్రిపాఠి: పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి దర్శనం ఇలా..

లావణ్య త్రిపాఠి

లావణ్య త్రిపాఠి గతేడాది మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ని పెళ్లాడిన సంగతి తెలిసిందే. పెళ్లయ్యాక నటన నుంచి తప్పుకుంటారా? లేదా? అన్నదానిపై క్లారిటీ లేదు కానీ.. పెళ్లికి ముందు చేసిన ప్రాజెక్టులను పూర్తి చేసే పనిలో పడింది. తాజాగా ఆమె ఓ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించబోతోంది. గతేడాది ‘అతిథి, దయ, వధువు’ వంటి వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులను అలరించిన డిస్నీ ప్లస్ హాట్‌స్టార్.. కొత్త ఏడాదిలో ‘మిస్ పర్ఫెక్ట్’ పేరుతో మరో కొత్త సిరీస్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఇందులో లావణ్య త్రిపాఠి కీలక పాత్ర పోషించింది. పెళ్లికి ముందు నటించినా.. పెళ్లి తర్వాత ఈ వెబ్ సిరీస్ విడుదలవుతున్నందున ఆమెకు ఇది చాలా ముఖ్యం.

ఇక ‘మిస్ పర్ఫెక్ట్’ విషయానికి వస్తే.. అన్నీ పర్ఫెక్ట్‌గా చేసే మిస్టర్ పర్ఫెక్ట్ గురించి అందరికీ తెలిసిందే.. అయితే మిస్ పర్ఫెక్ట్ ఎంత పర్ఫెక్ట్‌గా పనిచేసిందో, ఎలా చేసిందో దర్శకుడు విశ్వక్ ఖండేరావు ఈ వెబ్ సిరీస్‌లో నవ్వించేలా చూపించబోతున్నారు. లావణ్య త్రిపాఠి, అభిజిత్ దుద్దాల, అభిజ్ఞ ఉతలూరు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ వెబ్ సిరీస్‌ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. ‘మిస్ పర్ఫెక్ట్’ వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ బుధవారం విడుదల చేశారు. (మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్)

మిస్-పర్ఫెక్ట్.jpg

ఈ సందర్భంగా లావణ్య త్రిపాఠి స్పందిస్తూ.. ‘కొత్త సంవత్సరాన్ని ‘పర్ఫెక్ట్’గా ప్రారంభించబోతున్నాం’ అంటూ ట్వీట్ చేసింది. ఈ వెబ్ సిరీస్ హాట్ స్టార్ స్పెషల్‌గా త్వరలో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా నిర్మాత సుప్రియ యార్లగడ్డ మాట్లాడుతూ.. ‘మిస్‌ పర్‌ఫెక్ట్‌’ లాంటి విలక్షణమైన కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఆనందంగా ఉందన్నారు. మన జీవితంలో అనుకోకుండా ఏర్పడే కొన్ని అనుబంధాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయనే కథాంశంతో వినోదాత్మక ప్రేమకథగా ‘మిస్ పర్ఫెక్ట్’ చిత్రాన్ని రూపొందించాం. అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సిరీస్‌తో కనెక్ట్ అవుతారు. ప్రేక్షకులందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను అన్నారు.

ఇది కూడా చదవండి:

====================

*BSS10: బెల్లంకొండ శ్రీనివాస్, సాగర్ కె చంద్ర కాంబో మూవీకి పవర్ ఫుల్ టైటిల్.. గ్లింప్స్ చూశారా?

****************************

*హనుమాన్: ‘హను-మాన్’ ‘శ్రీరామధూత స్తోత్రం’.. ఇది వేరే స్థాయి.

*******************************

*తేజ సజ్జా: సూపర్‌స్టార్‌తో పోటీ కాదు..తో పాటు.. అంతే!

*******************************

*మంగై: తెలుగుగమ్మాయి ప్రధాన పాత్రలో తమిళ చిత్రం.. ఫస్ట్ లుక్ విడుదల

****************************

నవీకరించబడిన తేదీ – జనవరి 03, 2024 | 06:02 PM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *