షాహీన్ అఫ్రిది: కెప్టెన్సీ అంత ఈజీ కాదు..! షాహీన్‌పై ట్రోలింగ్

షాహీన్ అఫ్రిది: కెప్టెన్సీ అంత ఈజీ కాదు..!  షాహీన్‌పై ట్రోలింగ్

ఈ మ్యాచ్‌లో అఫ్రిది కెప్టెన్‌గానే కాకుండా బౌలర్‌గా కూడా విఫలమయ్యాడు.

షాహీన్ అఫ్రిది: కెప్టెన్సీ అంత ఈజీ కాదు..!  షాహీన్‌పై ట్రోలింగ్

షాహీన్ అఫ్రిది

షాహీన్ అఫ్రిది: భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్ 2023లో పాకిస్థాన్ పేలవ ప్రదర్శనతో బాబర్ ఆజం మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు టీ20ల్లో కెప్టెన్సీ బాధ్యతలను ఆ జట్టు స్టార్ పేసర్ షహీన్ అఫ్రిదికి అప్పగించింది. ఈ క్రమంలో షాహీన్ అఫ్రిది నేతృత్వంలోని పాకిస్థాన్ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటిస్తోంది. ఆక్లాండ్ వేదికగా జరిగిన తొలి టీ20లో పాక్, కివీస్ జట్లు తలపడ్డాయి.

ఈ మ్యాచ్‌లో అఫ్రిది కెప్టెన్‌గానే కాకుండా బౌలర్‌గా కూడా విఫలమయ్యాడు. ఈ స్టార్ పేసర్ ఒకే ఓవర్లో 24 పరుగులు ఇచ్చాడు. కివీస్‌ ఓపెనర్‌ ఫిన్‌ అలెన్‌ 6, 4, 4, 4, 6 పరుగులతో అఫ్రిది తన టీ20 కెరీర్‌లో అత్యధిక పరుగులను నమోదు చేశాడు. ఇక ఈమ్యాచ్‌లో పాకిస్థాన్ ఓడిపోయింది. దీంతో షాహీన్‌పై ట్రోలింగ్ మొదలైంది. కెప్టెన్సీ అంత ఈజీ కాదంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రోహిత్ శర్మ: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. ప్రపంచ క్రికెట్‌లో ఒక్కడే..

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసింది. ఓపెనర్ డారిల్ మిచెల్ (61; 27 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేన్ విలియమ్సన్ (57; 42 బంతుల్లో 9 ఫోర్లు) అర్ధసెంచరీతో మెరిశాడు. చివర్లో చాప్ మన్ (26; 11 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది, అబ్బాస్ అఫ్రిది చెరో మూడు వికెట్లు తీశారు. హారిస్ రవూఫ్ రెండు వికెట్లు తీశాడు.

అనంతరం పాక్ 18 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్ 46 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాక్ బ్యాట్స్‌మెన్‌లో బాబర్ అజామ్ (57; 35 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీతో రాణించాడు. మిగతా వారు విఫలమవడంతో పాకిస్థాన్‌కు ఓటమి తప్పలేదు. కివీస్ బౌలర్లలో టిమ్ సౌథీ నాలుగు వికెట్లతో చెలరేగాడు. ఆడమ్ మిల్నే, బెన్ సియర్స్ చెరో రెండు వికెట్లు తీశారు. ఇష్ సోథే ఒక వికెట్ తీశాడు.

ఇషాన్ కిషన్: ద్రవిడ్ మాటను లెక్క చేయకండి ఇషాన్ కిషన్! ప్రమాదంలో కెరీర్..?

కాగా.. ఈ మ్యాచ్ లో 406 పరుగులు నమోదయ్యాయి. పాకిస్థాన్, కివీస్‌లు తలపడిన సందర్భాల్లో టీ20ల్లో అత్యధిక పరుగులు నమోదైన మ్యాచుల్లో అగ్రస్థానంలో నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *