అగ్ని ప్రమాదం : స్కూల్ హాస్టల్‌లో భారీ అగ్నిప్రమాదం.. 13 మంది సజీవ దహనం

స్కూల్ హాస్టల్‌లో మంటలు చెలరేగడంతో 13 మంది చనిపోయారు.

అగ్ని ప్రమాదం : స్కూల్ హాస్టల్‌లో భారీ అగ్నిప్రమాదం.. 13 మంది సజీవ దహనం

సెంట్రల్ చైనాలోని స్కూల్ డార్మ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 13 మంది చనిపోయారు

స్కూల్ హాస్టల్‌లో మంటలు చెలరేగడంతో 13 మంది చనిపోయారు. ఈ దారుణ ఘటన సెంట్రల్ చైనాలో చోటుచేసుకుంది.

చైనాకు చెందిన జిన్హువా వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, హెనాన్ ప్రావిన్స్‌లోని యన్‌షాన్‌పు గ్రామంలోని యింగ్‌కాయ్ పాఠశాల వసతి గృహంలో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది.

రాత్రి 11 గంటలకు అగ్నిమాపక శాఖకు సమాచారం అందిందని వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సుమారు అరగంట పాటు శ్రమించి 11.38 గంటలకు మంటలను అదుపులోకి తెచ్చినట్లు ఆమె తెలిపారు.

ఈ ఘటనలో 13 మంది మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు ఈమేరకు పాఠశాల ప్రధానాధికారిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.

Cassandra Mae Spittmann : జర్మన్ సింగర్ నోటా రామ్ అయేంగే పాట.. ఆ గాయని.. అంటూ ప్రశంసించిన మోదీ..

ఇది నర్సరీ మరియు ప్రైమరీ వయస్సు విద్యార్థులకు విద్యను అందించే ప్రైవేట్ పాఠశాల అని తెలుస్తోంది. కానీ.. మరణించిన వారు పిల్లలా, పెద్దవారా..? అన్న విషయాలు బయటపెట్టలేదు. కాగా, ఈ ఘటనపై శనివారం సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఇదిలా ఉంటే చైనాలో ఇలాంటి ఘటనలు పరిపాటిగా మారాయి. గతేడాది నవంబర్‌లో షాంగ్సీ ప్రావిన్స్‌లోని లులియాంగ్‌ సిటీలోని ఓ కంపెనీ కార్యాలయ భవనంలో మంటలు చెలరేగడంతో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో ఆసుపత్రిలో చేరారు. అంతకుముందు ఏప్రిల్‌లో బీజింగ్‌లోని ఓ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో 29 మంది మరణించారు.

ప్రపంచ సంపన్న కుటుంబం : 700 కార్లు.. రూ. 4 వేల కోట్ల ప్యాలెస్.. 8 జెట్ విమానాలు.. ప్రపంచంలోనే అత్యంత ధనిక కుటుంబం ఏంటో తెలుసా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *