షోయబ్ మాలిక్: చరిత్ర సృష్టించిన షోయబ్ మాలిక్.. క్రిస్ గేల్ తర్వాత..

షోయబ్ మాలిక్: చరిత్ర సృష్టించిన షోయబ్ మాలిక్.. క్రిస్ గేల్ తర్వాత..

ABN
, ప్రచురణ తేదీ – జనవరి 21, 2024 | 11:37 AM

పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ చరిత్ర సృష్టించాడు. అతను అన్ని రకాల టీ20 క్రికెట్‌లో 13 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి ఆసియా క్రికెటర్‌గా సరికొత్త రికార్డు సృష్టించాడు.

షోయబ్ మాలిక్: చరిత్ర సృష్టించిన షోయబ్ మాలిక్.. క్రిస్ గేల్ తర్వాత..

ఢాకా: పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ చరిత్ర సృష్టించాడు. అతను అన్ని రకాల టీ20 క్రికెట్‌లో 13 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి ఆసియా క్రికెటర్‌గా సరికొత్త రికార్డు సృష్టించాడు. ఓవరాల్ గా టీ20 క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన రెండో బ్యాట్స్ మెన్ గా నిలిచాడు. ఈ జాబితాలో వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు. శనివారం బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో షోయబ్ మాలిక్ ఈ రికార్డును అందుకున్నాడు. ఈ లీగ్‌లో రంగ్‌పూర్ రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన షోయబ్ ఫార్చ్యూన్ బరిషల్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా 13 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఫార్చూన్ బరిసాల్ 137 పరుగులు చేసింది. 138 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన షోయబ్ మాలిక్ జట్టు 19.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. ఈ మ్యాచ్‌లో ఆరో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన షోయబ్ మాలిక్ 18 బంతుల్లో 17 పరుగులు చేశాడు. 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద 13 వేల పరుగులు పూర్తి చేశాడు.

కాగా షోయబ్ మాలిక్ 487 టీ20 ఇన్నింగ్స్‌ల్లో ఈ రికార్డును అందుకున్నాడు. 41 ఏళ్ల షోయబ్ మాలిక్ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 124 మ్యాచ్‌లు ఆడాడు. అతను 31 సగటుతో 2435 పరుగులు చేశాడు. ఇందులో 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లో 28 వికెట్లు తీశాడు. 14,562 పరుగులు చేసిన క్రిస్ గేల్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. కీరన్ పొలార్డ్ 12,454 పరుగులతో మూడో స్థానంలో, విరాట్ కోహ్లీ 11,994 పరుగులతో నాలుగో స్థానంలో, అలెక్స్ హేల్స్ 11,807 పరుగులతో ఐదో స్థానంలో ఉన్నారు. ఇటీవల షోయబ్ మాలిక్ పెళ్లి చేసుకున్నాడు. షోయబ్ పాకిస్థాన్ నటి సనా జావేద్‌ను వివాహం చేసుకున్నాడు. 41 ఏళ్ల షోయబ్ మాలిక్‌కి ఇది మూడో పెళ్లి. షోయబ్‌కి ఇప్పటివరకు రెండు పెళ్లిళ్లు అయ్యాయి. ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను షోయబ్ 2010లో రెండో పెళ్లి చేసుకున్నాడు. వారి 14 సంవత్సరాల వివాహానికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు.

ఇలాంటివి మరిన్ని క్రీడా వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నవీకరించబడిన తేదీ – జనవరి 21, 2024 | 11:38 AM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *