– ఘనంగా లోకేష్ పుట్టినరోజు వేడుకలు
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని బెంగళూరు టీడీపీ ఫోరం సభ్యులు తెలిపారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలను మంగళవారం బెంగళూరు టీడీపీ ఫోరం కార్యాలయంలో అభిమానులు ఘనంగా నిర్వహించారు. చిన్నారులతో కలిసి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో బెంగళూరు టీడీపీ ఫోరం నాయకులు రవిమోహన్ చౌదరి, సోంపల్లి శ్రీకాంత్, పవన్ మోటుపల్లి, శివ చినుమోలు, కోకా కేశవ్, ప్రసాద్, రవి, సురేష్, లెనిన్, రాజు, రమేష్, శివకుమారి, నవీన్ రెడ్డి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫోరం నాయకులు మాట్లాడుతూ నారా లోకేష్ యువగళం పేరుతో కుప్పంలో పాదయాత్ర ప్రారంభించి 3,132 కిలోమీటర్లు ప్రయాణించి లక్షలాది మందిని స్వయంగా కలుసుకుని వారి సమస్యలను అర్థం చేసుకుని ప్రజాస్వామ్య వ్యవస్థకు నిజమైన నిర్వచనం ఇచ్చారన్నారు. బెంగళూరులో స్థిరపడిన ప్రవాసులు ఎన్నికల సంఘం ప్రకటించిన తుది ఓటరు జాబితాను సరిచూసుకోవాలని సూచించారు. జాబితాలో ఓటు ఉందో లేదో తెలుసుకునేందుకు బెంగళూరు టీడీపీ ఫోరం కార్యాలయంలో ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి వినియోగించుకోవాలని కోరారు.
యలహంకలో..
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలను మంగళవారం సాయంత్రం యలహంకలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రముఖులు పాపన్న, చెన్నకేశవులు, చిన్నప్ప నాయకులు. కేక్ కట్ చేసి పంచారు. హోటల్ రమణ, ఉత్తన్న, వెంకటరమణారెడ్డి, రెడ్డెప్పారెడ్డి, పురుషోత్తం, ఓడీసీలు బాబా, బాలాజీ, నాగిరెడ్డి, వేమారెడ్డి, అశోక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాపన్న మాట్లాడుతూ తెలుగుదేశంలో బడుగు బలహీన వర్గాలకు సముచిత స్థానం లభిస్తుందన్నారు. బీసీలే పార్టీకి వెన్నెముక. ఈ ఎన్నికల్లో టీడీపీని గెలిపించి మళ్లీ చంద్రబాబు నాయుడును సీఎం చేయడమే లక్ష్యం. కార్యక్రమంలో హిందూపురం, పెనుకొండ, రాప్తాడు, ధర్మవరం మండలాల టీడీపీ అభిమానులు పాల్గొన్నారు.
నవీకరించబడిన తేదీ – జనవరి 24, 2024 | 01:05 PM