IND vs ENG: టీమ్ ఇండియాకు షాక్.. గాయంతో జట్టుకు దూరమైన శుభమాన్ గిల్

ABN
, ప్రచురించిన తేదీ – ఫిబ్రవరి 05 , 2024 | 10:51 AM

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. యువ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ గాయపడ్డాడు. అందుకే నాలుగో రోజు ఫీల్డింగ్‌కు రాలేదు. నాలుగో రోజు ఆట ప్రారంభానికి ముందు ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.

IND vs ENG: టీమ్ ఇండియాకు షాక్.. గాయంతో జట్టుకు దూరమైన శుభమాన్ గిల్

వైజాగ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. యువ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ గాయపడ్డాడు. అందుకే నాలుగో రోజు ఫీల్డింగ్‌కు రాలేదు. నాలుగో రోజు ఆట ప్రారంభానికి ముందు ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. 24 ఏళ్ల శుభ్‌మన్ గిల్ కుడి చేతి వేలికి గాయమైంది. రెండో రోజు ఆటలో షార్ట్ లెగ్ వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా గిల్ గాయపడ్డాడు. గాయంతో బాధపడుతూ మూడో రోజు బ్యాటింగ్ చేసి సెంచరీ సాధించాడు. మిగతా బ్యాట్స్‌మెన్‌లందరూ విఫలమైనప్పటికీ గిల్ సెంచరీ సాధించాడు. దీంతో ఇంగ్లండ్ ముందు టీమిండియా 399 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది. తర్వాత గిల్ గాయం తీవ్రత పెరగడంతో బీసీసీఐ వైద్య బృందం అతడిని పరీక్షించి నాలుగో రోజు ఫీల్డింగ్‌కు దూరంగా ఉంచింది. దీంతో నాలుగో రోజు ఆటలో గిల్ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ ఫీల్డింగ్ చేస్తున్నాడు. అయితే మూడో టెస్టు మ్యాచ్ నాటికి గిల్ కోలుకుంటాడో లేదో చూడాలి. గాయాల కారణంగా ఇప్పటికే రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. వీరిద్దరూ మూడో టెస్టులో ఆడతారా లేదా అనే విషయంపై క్లారిటీ లేదు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఓవర్ నైట్ స్కోరు 67/1తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ 399 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేలోపే రెండో వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన రెహాన్ అహ్మద్‌ను లెగ్ బైస్‌లో అక్షర్ పటేల్ పెవిలియన్‌కు చేర్చాడు. 95 పరుగుల వద్ద ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. అనంతరం ఓలీ పోప్‌తో కలిసి ఇన్నింగ్స్‌ని నడిపించిన ఓపెనర్ జాక్ క్రాలే జట్టు స్కోరును 100 పరుగులు దాటించాడు. తన టెస్టు కెరీర్‌లో 12వ అర్ధ సెంచరీని కూడా పూర్తి చేశాడు. కానీ కట్టుదిట్టంగా ఆడుతున్న ఓలి పోప్ (23)ను 29వ ఓవర్లో అశ్విన్ అవుట్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ 132 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 396 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 253 పరుగులు చేసింది. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 143 పరుగుల ఆధిక్యం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 255 పరుగులకు ఆలౌటైంది.

మరింత క్రీడా వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నవీకరించబడిన తేదీ – ఫిబ్రవరి 05, 2024 | 10:51 AM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *