ఇంగ్లండ్‌తో మూడో టెస్టు మ్యాచ్‌కి ముందు టీమిండియాకు మరో షాక్ తగిలింది.

ఇంగ్లండ్‌తో జరిగిన 3వ టెస్టులో కేఎల్ రాహుల్ ఔట్ అయినట్లు సమాచారం
IND vs ENG: ఇంగ్లండ్‌తో మూడో టెస్టు మ్యాచ్‌కి ముందు టీమిండియాకు మరో షాక్ తగిలింది. గాయం కారణంగా శ్రేయాస్ అయ్యర్ ఇప్పటికే జట్టుకు దూరమవగా, తాజాగా కీలక ఆటగాడు కేఎల్ రాహుల్ కూడా ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేడు. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో రాహుల్ స్నాయువు గాయానికి గురయ్యాడు. అతను వరుసగా రెండో టెస్టుకు దూరమయ్యాడు. అతను బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సిఎ)లో పునరావాసం పొందుతున్నాడు.
ఇంగ్లండ్‌తో మిగిలిన మూడు టెస్టు మ్యాచ్‌ల కోసం బీసీసీఐ రెండు రోజుల క్రితం జట్టును ప్రకటించింది. కేఎల్ రాహుల్‌తో పాటు రవీంద్ర జడేజాకు చోటు దక్కింది. అయితే ఫిట్‌నెస్ సాధిస్తేనే మ్యాచ్‌కు అందుబాటులో ఉంటారని జట్టును ప్రకటించే సమయంలో బీసీసీఐ పేర్కొంది. ఇదిలా ఉంటే జడేజా పూర్తి ఫిట్ నెస్ సాధించినా రాహుల్ ఇంకా ఫిట్ నెస్ సాధించలేదని తెలుస్తోంది. మరో వారం రోజుల పాటు బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉంటాడని ఆంగ్ల మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఫిబ్రవరి 15వ తేదీ గురువారం నుంచి రాజ్‌కోట్ వేదికగా ప్రారంభం కానున్న మూడో టెస్టు మ్యాచ్‌కు అతడు అందుబాటులో లేడు. ఫిబ్రవరి 23న రాంచీ వేదికగా జరగనున్న నాలుగో టెస్టు మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉంటాడో లేదో తెలియదు. ఇదిలా ఉంటే ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్, ఇంగ్లండ్ జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. దీంతో మూడో టెస్టు మ్యాచ్ కీలకంగా మారింది.
రాహుల్‌కు బదులు..
కేఎల్ రాహుల్ స్థానంలో దేవదత్ పడిక్కల్ జట్టులోకి రానున్నాడు. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. రంజీ ట్రోఫీలో పరుగుల వరద కురిపిస్తున్నాడు. పంజాబ్‌పై 193, గోవాపై 103, ఇటీవల కర్ణాటకపై 151 పరుగులు చేసిన పడిక్కల్ సెంచరీలతో సంబరాలు చేసుకుంటున్నాడు. ఇటీవల ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన రెండు అనధికారిక టెస్టుల్లో భారత్ తరఫున అతను మూడు ఇన్నింగ్స్‌ల్లో 105, 65 మరియు 21 పరుగులు చేశాడు.
AUS vs WI : ప్రత్యర్థులు ఇలా ఉంటే.. క్రికెట్‌లో రనౌట్లు గల్లంతు! ఇలాంటివి ఎప్పుడూ చూడలేదు
రాహుల్ స్థానంలో జట్టులోకి వచ్చినప్పటికీ మూడో టెస్టులో పడిక్కల్ ఆడే అవకాశం లేదు. యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రం చేసే అవకాశం ఉంది.