Bharath Bandh: భారత్ బంద్ లో ఏం జరిగిందో తెలుసా?

Bharath Bandh: భారత్ బంద్ లో ఏం జరిగిందో తెలుసా?

పంజాబ్‌లో ఆందోళనలో పాల్గొనేందుకు వచ్చిన ఓ రైతు గుండెపోటుతో మృతి చెందాడు. నాలుగు రోజుల పాటు సమస్యల పరిష్కారానికి..

Bharath Bandh: భారత్ బంద్ లో ఏం జరిగిందో తెలుసా?

భారత్ బంద్

దేశవ్యాప్తంగా రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్ విజయవంతమైంది. బంద్‌లో భాగంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉద్రిక్తతల మధ్య నిరసన కార్యక్రమాలు జరిగాయి. జాతీయ రహదారుల దిగ్బంధనంతో పాటు రైల్ స్టాప్ లు, టోల్ ప్లాజాల వద్ద నిరసనలు చేపట్టారు. పంజాబ్‌లోని శంభు సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు మరోసారి బాష్పవాయువు ప్రయోగించారు. పంజాబ్‌లో ఆందోళనలో పాల్గొనేందుకు వచ్చిన ఓ రైతు గుండెపోటుతో మృతి చెందాడు.

నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులు సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. మూడు రోజులుగా రోడ్లపైనే బైఠాయించిన రైతులు శుక్రవారం ఉదయం మరోసారి నిరసనకు సిద్ధమయ్యారు. 6 గంటల నుంచి రోడ్లపైనే టీలు, టిఫిన్లు అందించి నిరసనలు చేపట్టారు. ట్రేడ్ యూనియన్ బంద్‌లో సంయుక్త కిసాన్ మోర్చాతో పాటు రైతులు, కార్మికులు, మహిళలు సహా వివిధ సంఘాలు పాల్గొన్నాయి.

బంద్‌లో భాగంగా రైతులు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జాతీయ రహదారులను దిగ్బంధించారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోని ప్రధాన రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద రైతులు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. వాహనాల రాకపోకలను అడ్డుకునేందుకు అన్ని రహదారులను దిగ్బంధించారు. మరోవైపు బంద్ కారణంగా పంజాబ్‌లో బస్సులు అన్ని బస్టాప్‌లకే పరిమితమయ్యాయి. సుమారు 3 వేల ప్రభుత్వ బస్సుల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

రైల్రోకో..
మరోవైపు.. పంజాబ్‌లోని పలు చోట్ల రైతులు రైల్‌రోకో నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల ట్రాఫిక్‌ స్తంభించింది. అయితే రైతుల ఆందోళనతో ఇప్పటికే పలు రైళ్ల రాకపోకలను నిలిపివేసిన రైల్వే శాఖ.. లూథియానా-సాహ్నేవాల్-చండీగఢ్ మార్గంలో 6 రైళ్లను దారి మళ్లించింది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో జరిగిన ఆందోళనలో రైతు ఉద్యమ నేత రాకేష్ తికాయత్ పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేది లేదని ప్రకటించారు.

ఇక.. హర్యానాలోని శంభు సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బంద్ సందర్భంగా వందలాది మంది రైతులు జాతీయ రహదారులను దిగ్బంధించారు. రైతులను అడ్డుకునేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. ఈ క్రమంలో పలువురు రైతులు గాయపడ్డారు. మరోవైపు అంబాలా సమీపంలో ఆందోళన చేస్తున్న జ్ఞాన్ సింగ్ (65) అనే రైతు శుక్రవారం ఉదయం కన్నుమూశారు. గుండె నొప్పి రావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

పోలీసుల కఠిన చర్యలు
మరోవైపు రైతులు ఢిల్లీలోకి రాకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. పోలీసులు 30 వేల టియర్ గ్యాస్ సెల్స్ సిద్ధం చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రైతులు ఇచ్చిన బంద్‌కు తెలుగు రాష్ట్రాల్లో రైతులు, కార్మికులు మద్దతు ప్రకటించారు. సాయంత్రం 4 గంటల వరకు రైతులు, కార్మిక సంఘాలు బంద్‌లో పాల్గొన్నాయి.

రైతుల ఆందోళన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం కాకపోవడంతో ఆదివారం మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. అయితే తమ డిమాండ్లను పరిష్కరించే వరకు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విరమించేది లేదని రైతులు ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో రైతులు, కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *