యాక్సిస్ మ్యూచువల్ ఫండ్.. యాక్సిస్ ఎస్ అండ్ పీ బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ ఫండ్ ప్రారంభించింది. ఇది ఓపెన్ ఎండెడ్ ఇండెక్స్ ఫండ్. ఫండ్ S&P BSE సెన్సెక్స్ TRIని ట్రాక్ చేస్తుంది…

యాక్సిస్ మ్యూచువల్ ఫండ్.. యాక్సిస్ S&P BSE సెన్సెక్స్ ఇండెక్స్ ఫండ్‌ను ప్రారంభించింది. ఇది ఓపెన్ ఎండెడ్ ఇండెక్స్ ఫండ్. ఫండ్ S&P BSE సెన్సెక్స్ TRIని ట్రాక్ చేస్తుంది. ఈ ఫండ్ లార్జ్ క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఒకే ఇండెక్స్‌తో వివిధ రంగాల్లోని అవకాశాలను అందిపుచ్చుకుని, దీర్ఘకాలం పాటు ఇన్వెస్టర్లకు మంచి రాబడులను అందించే విధంగా దీన్ని రూపొందించినట్లు యాక్సిస్ ఎంఎఫ్ వెల్లడించింది. ఈ ఫండ్ ముగింపు తేదీ ఈ నెల 22. ఈ ఫండ్ కనీస పెట్టుబడి రూ.500.
యూనియన్ బిజినెస్ సైకిల్ ఫండ్
యూనియన్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్.. యూనియన్ బిజినెస్ సైకిల్ ఫండ్‌ను తీసుకొచ్చింది. ఇది ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ పథకం. ఆర్థిక వ్యవస్థలో ఉన్న వ్యాపార వాతావరణానికి అనుగుణంగా ఈ ఫండ్ పెట్టుబడులు పెడుతుంది. ఫండ్ మార్కెట్‌లో యాక్టివ్ సెక్టార్‌లు మరియు కాస్త వెనుకబడిన రంగాల మధ్య బ్యాలెన్స్‌ను ఉంచుతూ ఎప్పటికప్పుడు పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ ఫండ్ కనీస పెట్టుబడి రూ.1,000. ఈ ఫండ్ ముగింపు తేదీ ఫిబ్రవరి 27.
బరోడా BNP పారిబాస్ ఇన్నోవేషన్ ఫండ్
బరోడా BNP పరిబా MF.. బరోడా BNP పారిబాస్ ఇన్నోవేషన్ ఫండ్‌ను ప్రారంభించింది. ఇది ఇన్నోవేషన్ థీమ్‌తో తీసుకొచ్చిన ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ పథకం. ఈ ఫండ్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది ప్రధానంగా వినూత్న కంపెనీలపై దృష్టి సారిస్తుంది మరియు వాటిలో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి దీర్ఘకాలిక రాబడిని అందిస్తుంది. ఈ ఫండ్ ముగింపు తేదీ ఈ నెల 28. కనీస పెట్టుబడి రూ.1,000.
నవీకరించబడిన తేదీ – ఫిబ్రవరి 18, 2024 | 02:20 AM