ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1తో టీమిండియా కైవసం చేసుకుంది.

రాంచీ: ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1తో టీమిండియా కైవసం చేసుకుంది. దీంతో స్వదేశంలో భారత్ వరుసగా 17వ టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ శుభారంభం అందించారు. ఓపెనర్లిద్దరూ తొలి వికెట్‌కు 84 పరుగులు జోడించారు. కెప్టెన్ రోహిత్ హాఫ్ సెంచరీతో రాణించాడు. అయితే ఆ తర్వాత భారత జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. ఫలితంగా 120 పరుగులకే సగం వికెట్లు పడిపోయాయి. ఈ సమయంలో అద్భుతంగా ఆడిన శుభ్‌మన్ గిల్, ధ్రువ్ జురెల్ 72 పరుగుల అజేయ భాగస్వామ్యంతో జట్టును గెలిపించారు. గిల్ 52 పరుగులు, ధ్రువ్ 39 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. తొలి ఇన్నింగ్స్‌లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కీలక ఇన్నింగ్స్ ఆడిన ధ్రువ్ జురెల్ 90 పరుగులతో చెలరేగిపోయాడు. దీంతో ధృవ్ జురెల్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
ఈ క్రమంలో వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ ధృవ్ జురెల్ చరిత్ర సృష్టించాడు. గత 22 ఏళ్లలో, అరంగేట్రం టెస్టు సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును గెలుచుకున్న తొలి భారత వికెట్ కీపర్‌గా రికార్డు సృష్టించాడు. రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టు మ్యాచ్ ద్వారా ధ్రువ్ జురెల్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. 23 ఏళ్ల ధృవ్ జురెల్ మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బ్యాటింగ్ లోనే కాకుండా వికెట్ కీపింగ్ లోనూ ధృవ్ ఆకట్టుకుంటున్నాడు. దీంతో టీమిండియాలో వికెట్ కీపర్‌గా జురెల్‌కు సుస్థిర స్థానం ఖరారైంది. రోడ్డు ప్రమాదం కారణంగా, రిషబ్ పంత్ మరియు ఇషాన్ కిషన్ మానసిక సమస్యల కారణంగా జట్టుకు దూరంగా ఉన్నారు, మరియు KS భరత్ బ్యాటింగ్‌లో పరుగులు చేయలేకపోయాడు, కాబట్టి ధృవ్‌కు టీమిండియాలో స్థానం లభించింది. వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా లాగేసుకుని ధృవ్ తన సత్తా చాటుతున్నాడు.
మరింత క్రీడా వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నవీకరించబడిన తేదీ – ఫిబ్రవరి 26, 2024 | 06:02 PM