ప్రపంచకప్ 2023లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో..

ప్రపంచకప్ 2023లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ ముగిసింది. భారత జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. రన్ మెషీన్ విరాట్ కోహ్లీ (101 నాటౌట్) సెంచరీ చేశాడు. శ్రేయాస్ అయ్యర్ అర్ధ సెంచరీతో రాణించగా, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్ ఇంత భారీ స్కోరు సాధించింది.
తొలుత ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌లు టీమిండియాకు శుభారంభం అందించారు. ముఖ్యంగా.. రోహిత్ శర్మ క్రీజులో ఉన్నంతసేపు మెరిశాడు. ఎడాపెడా షాట్లతో ఆవేశంగా ఆడాడు. దీంతో 24 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 40 పరుగులు చేశాడు. రోహిత్ దూకుడు చూసి కచ్చితంగా 200 పరుగులు చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ.. ఇంతలోనే రోహిత్ ఔట్ కావడంతో గ్రౌండ్ మొత్తం కాసేపు నిశ్శబ్ధమైంది. ఆ తర్వాత కొద్దిసేపటికే శుభ్‌మన్ గిల్ కూడా అవుటవ్వడంతో భారత జట్టు ఒత్తిడిలో పడినట్లయింది. తర్వాత క్రీజులో ఉన్న విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్. దక్షిణాఫ్రికాకు మరో వికెట్ ఇవ్వకుండానే మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 134 పరుగులు జోడించారు. విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడకపోయినా మెరుగైన ఇన్నింగ్స్ తో జట్టును ఆదుకున్నాడు.
శ్రేయాస్ ఈసారి బాగా ఆడడం చూసి సెంచరీ చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ.. 77 వ్యక్తిగత పరుగుల వద్ద క్యాచ్ పట్టి పెవిలియన్ చేరుకున్నాడు. అనంతరం కేఎల్ రాహుల్ 8 పరుగుల వద్ద ఔటయ్యాడు. అయితే.. చివర్లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (22), జడేజా (29 నాటౌట్) రాణించారు. కోహ్లి చివరి వరకు క్రీజులో నిలిచి సెంచరీ పూర్తి చేసినా అతడి నుంచి ఆశించిన భారీ షాట్లు పడలేదు. 121 బంతుల్లో 10 ఫోర్లతో అజేయంగా 101 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే దక్షిణాఫ్రికా 327 పరుగులు చేయాల్సి ఉంది. ఇది మంచి లక్ష్యమే అయినప్పటికీ.. ఈ మెగా టోర్నీలో దక్షిణాఫ్రికా విజృంభిస్తోంది. కాబట్టి.. బౌలర్లు గట్టిగా బౌలింగ్ చేసి జట్టును కట్టడి చేయాలి.
నవీకరించబడిన తేదీ – 2023-11-05T18:18:17+05:30 IST