బెంగళూరు: టీడీపీని గెలిపిద్దాం… ఏపీని కాపాడుకుందాం…

– కనిగిరి నియోజకవర్గ పార్టీ శ్రేణులకు మాజీ ఎమ్మెల్యే నూకా ఉగ్రనరసింహారెడ్డి పిలుపు

బెంగళూరు: కనిగిరి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ నూక ఉగ్ర నరసింహా రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు రానున్న అసెంబ్లీ ఎన్నికలు చాలా ముఖ్యమైనవని, రాష్ట్రాన్ని కాపాడేందుకు ఇది అపూర్వమైన అవకాశం అని అన్నారు. సోమవారం బెంగళూరు కళ్యాణనగర్ చెళ్లకెరె కొంకణ్ సముదాయభవన్‌లో జరిగిన కనిగిరి శాసనసభ నియోజకవర్గ తెలుగుదేశం అభిమానుల ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచేలా ప్రసంగించారు. ఏపీలో అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందన్నారు. దీంతో రాష్ట్ర అభివృద్ధి 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయింది. ఏపీలో ప్రజలకు రక్షణ కరువైందని, చివరకు జర్నలిస్టులను కూడా వదిలిపెట్టడం లేదని వాపోయారు. తెలుగుదేశం అభిమానులు, కార్యకర్తలు ఏకమై ఏపీలోని ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి. దివంగత ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పితే చంద్రబాబు నాయుడు తెలుగువారి సామర్థ్యాలను ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పారన్నారు. ముఖ్యంగా ఆయన హయాంలో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కింది. టీడీపీ అభిమానులు, కార్యకర్తలపై దాడులు, అన్యాయాన్ని ప్రశ్నించిన వారిపై దాడులు నిత్యకృత్యంగా మారాయి. దేశంలో మరెక్కడా ఇలాంటి పరిస్థితి లేదు. అంతకుముందు కనిగిరి యోజకవర్గ వాసుల సంక్షేమాన్ని పేరుపేరునా అడిగి తెలుసుకున్నారు. వారి సూచనలను శ్రద్ధగా విన్నారు. తొలుత ప మూరుపల్లికి చెందిన గంగవరపు సుబ్బారావు స్వాగతం పలికారు. క నకమేడల వీర, అట్లూరి రామకృష్ణరాజు, మద్దినేని మోహన్ రావు, గోళ్ల కిరణ్, చింతగంపాల మహేంద్ర, కురుగొండల దామోదర్, ఏవీఆర్, వీరస్వామి, లక్ష్మీనారాయణ, డి.సుబ్బారావు, ధనేకుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కనిగిరి నియోజకవర్గ నాయకులతో పాటు బీటీఎఫ్ ఆఫీస్ బేరర్లు, కార్యవర్గ సభ్యులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *