సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు, ఇంగ్లండ్ యువ క్రికెటర్ హ్యారీ బ్రూక్ చరిత్ర సృష్టించాడు. అతను ఇండియన్ ప్రీమియర్ లీగ్, ది హండ్రెడ్ లీగ్ మరియు పాకిస్తాన్ సూపర్ లీగ్‌లలో సెంచరీలు సాధించిన మొదటి ఆటగాడిగా నిలిచాడు.

హ్యారీ బ్రూక్
హ్యారీ బ్రూక్ సెంచరీ: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు, ఇంగ్లండ్ యువ క్రికెటర్ హ్యారీ బ్రూక్ (హ్యారీ బ్రూక్) చరిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL), ది హండ్రెడ్ లీగ్ (THL) మరియు పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) లలో సెంచరీలు సాధించిన మొదటి ఆటగాడిగా అతను నిలిచాడు. బ్రూక్ కంటే ముందు ఏ ఆటగాడు సెంచరీలు చేయలేదు, అయినప్పటికీ చాలా మంది మూడు లీగ్‌లలో ఆడారు. 2022 పీఎస్ఎల్ సీజన్, 2023 ఐపీఎల్ సీజన్లలో సెంచరీలు సాధించిన బ్రూక్.. తాజాగా ది హండ్రెడ్ లీగ్‌లో సెంచరీ చేయడంతో ఈ అరుదైన ఘనత సాధించాడు.
బ్రూక్ ది హండ్రెడ్ లీగ్‌లో నార్తర్న్ సూపర్‌చార్జర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తాడు. మంగళవారం వెల్ష్ ఫైర్ మరియు నార్తర్న్ సూపర్‌చార్జర్స్ జట్లు పోటీ పడ్డాయి. ఈ మ్యాచ్‌లో బ్రూక్‌కు ఆకాశమే హద్దుగా మారింది. బౌలర్లకు చుక్కలు చూపిస్తూ 42 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 105 పరుగులు చేశాడు. 41 బంతుల్లోనే సెంచరీ సాధించి.. ఈ లీగ్‌లో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ కావడం విశేషం.
IRE vs IND 3rd T20 : ఒక్క బంతి కూడా పడలేదు.. మ్యాచ్ రద్దు.. సిరీస్ టీమ్ ఇండియా సొంతం
బ్రూక్ 2022 పిఎస్‌ఎల్‌లో లాహోర్ క్వాలండర్స్ తరపున ఆడాడు. ఇస్లామాబాద్ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో, అతను 49 బంతుల్లో 10 ఫోర్లు మరియు 5 సిక్సర్ల సహాయంతో 102 పరుగుల ఇన్నింగ్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. ఈ విధ్వంసక ఇన్నింగ్స్‌ను చూసిన ఐపీఎల్ 2023 సీజన్‌కు ముందు బ్రూక్‌ను 13.25 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2023 సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ సన్‌రైజర్స్ ఆటగాడు 55 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 100 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో మినహా సీజన్లో అతను ఘోరంగా విఫలమయ్యాడు. 11 మ్యాచ్‌లు ఆడి 190 పరుగులు మాత్రమే చేశాడు. మూడు మ్యాచ్‌ల్లో డకౌట్ అయ్యాడు. దీంతో ఐపీఎల్ 2024 సీజన్ కంటే ముందే ఈ ఆటగాడిని విడుదల చేయాలనే ఆలోచనలో హైదరాబాద్ ఉంది.
టీమ్ ఇండియా : నెంబర్ 4 స్థానానికి సరైనోడు ఎవరు..? 2019 ప్రపంచకప్ తర్వాత 12 మంది ఆడితే..
బ్రూక్ గతేడాది అంతర్జాతీయ క్రికెట్లో ఇంగ్లండ్ తరఫున ఆడాడు. ఇప్పటి వరకు ఇంగ్లండ్ తరఫున 12 టెస్టులు, 3 వన్డేలు, 20 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 4 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీల సాయంతో 1,181 పరుగులు చేశాడు. వన్డేల్లో 86 పరుగులు, టీ20ల్లో 372 పరుగులు చేశాడు.