IND vs ENG: చరిత్ర సృష్టించిన మన అమ్మాయిలు.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో..

IND vs ENG: చరిత్ర సృష్టించిన మన అమ్మాయిలు.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో..

ABN
, ప్రచురణ తేదీ – డిసెంబర్ 16, 2023 | 01:01 PM

IND-W vs ENG-W: మహిళల టెస్ట్ క్రికెట్ చరిత్రలో మన అమ్మాయిలు చరిత్ర సృష్టించారు. టెస్టు క్రికెట్ చరిత్రలో భారత అమ్మాయిలు అత్యధిక పరుగుల స్కోరింగ్‌ను నమోదు చేశారు. ఇంగ్లండ్ మహిళల జట్టుతో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 347 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.

IND vs ENG: చరిత్ర సృష్టించిన మన అమ్మాయిలు.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో..

ముంబై: మహిళల టెస్ట్ క్రికెట్ చరిత్రలో మన అమ్మాయిలు చరిత్ర సృష్టించారు. టెస్టు క్రికెట్ చరిత్రలో భారత అమ్మాయిలు అత్యధిక పరుగుల స్కోరింగ్‌ను నమోదు చేశారు. ఇంగ్లండ్ మహిళల జట్టుతో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 347 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఆల్ రౌండ్ షోతో మన అమ్మాయిలు మ్యాచ్ ను ఏకపక్షంగా ముగించారు. ముఖ్యంగా మన స్పిన్నర్లను ఎదుర్కోలేక ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. రెండు ఇన్నింగ్స్‌ల్లో ఆ జట్టు ఒక్కసారి కూడా 150 పరుగుల మార్కును దాటలేకపోయింది. స్పిన్నర్ దీప్తి శర్మ (9/39) అయితే విశ్వరూపం చూపింది. దీప్తి శర్మ బ్యాటింగ్‌లోనూ హాఫ్ సెంచరీతో రాణించింది. దీంతో నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగిసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన మన అమ్మాయిలు ఒక్కతాటిపైకి వచ్చి రెచ్చిపోయారు. కష్టపడి ఆడి తొలిరోజు 400కు పైగా పరుగులు చేసి రికార్డు సృష్టించారు. శుభా సతీష్ (69), జెమీమా రోడ్రిగ్స్ (68), దీప్తి శర్మ (67), యాస్తికా భాటియా (66) అర్ధ సెంచరీలతో రాణించారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా 49 పరుగులు చేసింది. దీంతో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 428 పరుగుల భారీ స్కోరు చేసింది.

భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ మహిళల జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 136 పరుగులకే కుప్పకూలింది. స్పిన్నర్ దీప్తి శర్మ 5 వికెట్లతో చెలరేగింది. స్నేహ రాణా 2 వికెట్లు తీయగా, రేణుకా సింగ్, పూజా వస్త్రాకర్ లు తీశారు. దీంతో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 292 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా స్కోరు 186/6 వద్ద డిక్లేర్ చేసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 44 పరుగులతో ఫర్వాలేదనిపించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 478 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. దీంతో ఇంగ్లండ్ మహిళల జట్టు ముందు భారత మహిళల జట్టు 479 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. భారీ లక్ష్యంలో విజయం సాధించిన సంగతి పక్కన పెడితే.. మన బౌలర్ల దెబ్బకు ఇంగ్లీష్ అమ్మాయిలు పోరాట పటిమ కూడా ప్రదర్శించలేకపోయారు. 131 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ 4, పూజా వస్త్రాకర్ 3, రుతురాజ్ గైక్వాడ్ 2, రేణుకా ఠాకూర్ సింగ్ 1 వికెట్ తీశారు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి మొత్తం 9 వికెట్లు పడగొట్టి బ్యాటింగ్‌లో హాఫ్ సెంచరీ చేసిన దీప్తి శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

నవీకరించబడిన తేదీ – డిసెంబర్ 16, 2023 | 01:01 PM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *